ఓ వైపు దేశంలో ప్రతి ఒక్కరిలో కరోనా వైరస్ బయం కనిపిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కంటికి కనిపించని మృత్యువు ఎటునుంచి దాడి చేస్తుందో అని భయపడుతున్నారు. దేశం మొత్తం కరోనా  వైరస్ భయంతో భయపడుతూ ఉంటే చాలా మంది కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పటికే కరోనా  వైరస్ గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అసత్య ప్రచారాలు నేపథ్యంలో ప్రజలు తీవ్ర అయోమయంలో పడిపోయారు. ఇలా రోజుకొక అసత్య ప్రచారం తెర మీదికి వస్తుంది. 

 

 తాజాగా మరో వదంతు  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈసారి వచ్చిన వదంతు  కరోనా  వైరస్ గురించి కాదు... ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి. ఓ వైపు  కరోనా  వైరస్ కి మందు లేదు పరిష్కారం లేదు అని భయపడుతున్న ప్రజలకి ఇలాంటి వదంతులు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. అదేంటంటే మహిళలు తమ తాళిబొట్టు కి పసుపుకొమ్ము కట్టుకుంటే  తమ ఐదోతనం నిలబడుతుంది అంటూ విచిత్రమైన ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 

 ఇప్పటికే కరోనా వైరస్ భయంతో ఇళ్లల్లో కూర్చుని నలిగిపోతున్నటువంటి మహిళలకు మానసికంగా మరింత భయాందోళనకు గురి చేసే విధంగా ప్రస్తుతం ఈ వదంతు ప్రచారం జరుగుతుంది . ప్రస్తుతం మహిళలు స్వామిజీలను ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మహిళలు తమ తాళిబొట్టు కు మధ్యలో పసుపు కొమ్ము కట్టుకుంటే ఐదోతనం నిలబడుతుంది అని ప్రచారం ఊపందుకుంది. అయితే ఇక ఈ వదంతులు  మహిళలు దీని పాటించారు కూడా . దీనిపై ఏకంగా  చిన్న జీయర్ స్వామి లాంటి వాళ్ళు స్పందించి  తాము ఇలాంటివేవి  చెప్పలేదని క్లారిటీ  ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఓ ఆడియో కింది వీడియోలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: