ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుంది. మొదటిలో చాలా ఆకతాయిగా తీసుకున్న గాని ఉన్న కొద్దీ ప్రజలలో అవగాహన రావటంతో భయంతో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఒకవేళ లాక్ డౌన్ జగన్ ఎత్తివేసే పరిస్థితి వచ్చిన గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఎక్కువ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నీ చాలా కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. మొదటిలో ఎవరికి వాళ్లు ఇళ్ల నుంచి బయటకు వస్తూ లాక్ డౌన్ నీ లెక్కచేయకుండా ముఖానికి మాస్కు లేకుండా ఇష్టానుసారంగా తిరిగారు.

 

అయితే రోజురోజుకీ చాపకింద నీరులా అనుకోని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో అందరూ బెదిరి పోతున్నారు. ఎక్కడో చైనాలో పుట్టింది మన సొంత ఊరు లోకి వచ్చేసిందంటే మన దగ్గరికి రావాలంటే పెద్ద విషయం కాదు అని ఎవరికి వారు చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం జగన్ పరిమిషన్ ఇచ్చిన జనం కదలటానికి ఎక్కువ ఇష్ట పడటం లేదు. ఊహించని విధంగా ఏప్రిల్ 20 తర్వాత ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదు అయ్యాయి.

 

ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసినా గాని ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం తో తెగ ఆందోళన చెందుతున్నారు. దీంతో వైయస్ జగన్ లాక్ డౌన్ నీ పట్టణాలలో జూన్ నెలాఖరు వరకు కొనసాగించాలని ఆలోచిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: