కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. అయినా గాని పాజిటివ్ కేసులు ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. సీఎం జగన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న గాని పాజిటివ్ కేసులు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. వైరస్ వచ్చిన ప్రారంభంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే కరోనా వైరస్ ని బాగా కట్టడి చేసిన రాష్ట్రంగా ఏపీ కి మంచి పేరు వచ్చింది. కానీ ఎప్పుడైతే ఢిల్లీ కేంద్రంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటం జరిగిందో దేశవ్యాప్తంగా తో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ముఖచిత్రాలు మారిపోయాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా కంట్రోల్ కాలేదు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ పరీక్షలు చేయించాలని జగన్ సర్కార్ ఇటీవల దక్షిణ కొరియా నుండి వైరస్ రాపిడ్ టెస్ట్ కిట్స్ తెప్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ టెస్టింగ్ వైరస్ రాపిడ్ కిట్స్ కొనుగోలులో అవినీతి జరిగిందని విపక్షాలు ఇటీవల ఆరోపణలు చేయడం జరిగింది.

 

అయితే వైద్య పరికరాల కు కేంద్రం నుంచి 500 కోట్లు తీసుకుని  పరికరాలను కొనుగోలు చేసింది. ఇటువంటి సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో... కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడిలో ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వైద్య పరికరాల కోసం 500 కోట్ల రూపాయల వివరాల లెక్కలు అడుగుతున్నట్లు సమాచారం.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: