దేశంలో రోజురోజుకీ కరోనా మహమ్మారి కలకలం పెరిగిపోతోంది. ప్రమాదకరమైన వైరస్ ని కట్టడి చేయడం కోసం దేశ ప్రభుత్వం ఎంతో కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నా కూడా పాజిటివ్ కేసులు సంఖ్యలో ఎటువంటి తగ్గుదల కనిపించడం లేదు. తొలి దశలో కూడా పెద్దగా ప్రభావం లేకపోవడంతో కరోనా విజృంభణ రేటును దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన తరువాత కూడా కేసులు గణనీయంగా పెరగడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

 

అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా ఇప్పుడు రాష్ట్రం నుండి మరొక సంచలన విషయం బయట పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ టాక్రే అధికార నివాసమైన వర్ష బంగ్లా వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్రమైన కలకలాన్ని రేపుతోంది. ప్రసారమాధ్యమాల్లో ఇదే హాట్ టాపిక్ కాగా ఆదివారం వచ్చిన ఆమె రిపోర్టర్ పాజిటివ్ అని రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. జాగ్రత్త చర్యలో భాగంగా మరొక ఆరుగురు పోలీసు సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కూడా ట్రెండింగ్ అవుతోంది.

 

విషయంపై సీనియర్ ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ.. మహిళా కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. కాగా మహిళా కానిస్టేబుల్ ఇటీవలే సీఎం అధికారిక భవనంలో విధులు నిర్వహించేందుకు వెళ్లినట్లు సామజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. దీనిపై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: