ప్రపంచ వ్యాప్తంగా  కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దీని దెబ్బకు ఇండియా సహా అనేక దేశాలు  లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఇక పాకిస్థాన్ లో కూడా కరోనా ప్రభావం అధికంగానే వుంది.  అయితే ఆర్థికంగా బలహినమైన  దేశం కావడంతో  పాకిస్థాన్ లాక్ డౌన్ వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటివరకు అక్కడ 10000 కేసులు నమోదు కాగా 212 మరణాలు సంభవించాయి. ఇక తాజాగా ఆ దేశ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్  కు కరోనా పరీక్షలు నిర్వహించగా  నెగిటివ్ వచ్చినట్లు  ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మీర్జా  వెల్లడించాడు. 
 
 
ఇక ఇండియా విషయానికి వస్తే లాక్ డౌన్ అమలులో వున్నా కూడా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఒక్క రోజే ముంబై లో 400కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే రాజస్థాన్ , ఢిల్లీ, గుజరాత్ లో దాదాపు 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈరాష్ట్రాలు ఇప్పుడు దేశానికి తలనొప్పిగా మారాయి. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 21000 దాటగా ఇందులో  700 కు పైగా మరణాలు సంభవించాయి. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా  అధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో ఇండియాలో 8 వ స్థానం లో కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: