ఒకవైపు తమ దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతున్నా పాకిస్థాన్ మాత్రం కుక్క తోక వంకర అన్నట్లు వ్యవహరిస్తోంది. వారి దేశంలో జనాభా రోజు రోజుకు చనిపోతునా కూడా తమ దుర్బుద్ధి మార్చుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే అక్కడ పది వేల కరోనా పాజిటివ్ కేసులు దాటిపోగా దేశ ప్రజలను కాపాడుకోవాల్సిన సమయంలో పాకిస్థాన్ దేశంలో వైరస్ ను ఒక ఆయుధంగా మార్చుకుని భారతదేశంలోకి పంపించి ఇక్కడ అల్లకల్లోలం చేయాలని చూస్తోంది.

 

వివరాల్లోకి వెళితే పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇప్పుడు కరోనా రోగులు ఎక్కువగా ఉన్నారు. అయితే కొద్ది వారాల ముందు పాకిస్థాన్ తమ దేశం నుండి సరిహద్దులోని భారత అధికారుల కళ్ళు గప్పి భారతదేశంలోకి కరోనా వైరస్ ఉన్న వారిని పంపించి దానిని ప్రజల మధ్య వ్యాపించేలా చేయాలని పన్నాగం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మరియు అధికారులు సరిహద్దుల వద్ద బందోబస్తు ఉంచి కఠినమైన చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పినట్లు కూడా నివేదికలు వచ్చాయి.

 

ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకే చెందిన కొంత మంది కీలక అధికారులు ప్రత్యేకంగా కరోనా వైరస్ సోకిన వారిని దాచిపెట్టి తాము అనుకున్న సమయంలో సరిహద్దు ప్రాంతాల నుండి భారతదేశానికి పంపించాలని భావిస్తున్నారట. వార్తలను జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ డిల్బాగ్ సింగ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఖరారు చేశారు.

 

పాక్ ఇంతవరకూ ఉగ్రవాదులను ఆయుధంగా చేసుకోవడమే మనకు తెలుసని వ్యాఖ్యానించిన ఆయనఇప్పుడు కరోనా పాజిటివ్ వ్యక్తులను కశ్మీర్‌లోకి చొప్పించాలనుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: