దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతుంటే , ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రజాప్రతినిధులే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం హాట్ టాఫిక్ గా మారింది .   రాజకీయ , మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి . అయినా ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాత్రం ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ , కరోనా వ్యాప్తికి  కారణం అవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి .

 

 ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాల వీరాంజనేయ స్వామి  తన పేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది . కొండెపి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరిస్తోన్న మాదాసి వెంకయ్య ఈ నెల 20న సుమారు 100 మంది పార్టీ కార్యకర్తలు , నాయకులతో సభ నిర్వహించినట్లుగా బాల వీరాంజనేయ స్వామి  సోషల్ మీడియా లో వీడియో ను  పోస్టు చేయడం తో , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది .

 

కరోనా కట్టడి కోసం ప్రపంచమంతా లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తుంటే  , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఆ నిబంధనలు పట్టవా ? అంటూ బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు . ఈ వంద మందిలో కరోనా సోకిన వారు  ఎవరైన  ఉంటే , ఆ ఊహే భయానకంగా ఉందని అన్నారు . లాక్ డౌన్ సమయం లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్ల తో భారీ ర్యాలీ నిర్వహించడం , నగరిలో ప్రారంభోత్సవాలు , గుంటూరు లో గెట్ టూ గెదర్ కార్యక్రమాలు , శ్రీకాకుళం లో ట్రస్ట్ సభలు నిర్వహించడం  హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు   .  

మరింత సమాచారం తెలుసుకోండి: