మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సురేష్ బాబు మరియు వెంకటేష్. ప్రస్తుతం సురేష్ బాబు నిర్మాతగా.. విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మూడో తరం హీరోగా రానా దగ్గుబాటి 'లీడర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి రానా కమర్షియల్ చిత్రాల మూసలో చిక్కుకోకుండా విలక్షణ నటుడిగా ఎదుగుతున్నాడు. 'బాహుబలి' చిత్రం రానాకు జాతీయవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. బాహుబలి చిత్రంలో రానా పోషించిన భల్లాల దేవుడు పాత్ర ఒక చరిత్రాత్మకం. అలాగే 'ఘాజి' చిత్రంతో కూడా రానా ప్రశంసలు దక్కించుకున్నాడు. హీరోగా రానా దగ్గుబాటిది టాలీవుడ్ లో పదేళ్ల ప్రస్థానం. పదేళ్లంటే చెప్పుకొనేంత పెద్ద సినీ జర్నీ ఏమి కాదు. ఐతే ఈ పదేళ్లలో రానా సాధించిన విజయాలు, ఎంచుకున్న పాత్రలు ఆయనకు అంత పేరు తీసుకువచ్చాయి.

 

స్టార్ హీరో హోదా రాకపోయినా స్టార్ యాక్టర్ గా ఆయన అన్ని పరిశ్రమలకు సుపరిచితుడే. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా రానాకు విశేష గుర్తింపు ఉంది. స్టార్ హీరోలకు కూడా సొంతం కానీ పాన్ ఇండియా ఇమేజ్ రానా సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా రానా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ వారు రానా పదేళ్ల సినీ ప్రయాణాన్ని వివరించడానికి కొన్ని వీడియోలను విడుదల చేసారు. వాటిలో 'బాహుబలి'లో తనకు అవకాశం ఎలా వచ్చిందో రానా చెప్పుకొచ్చాడు. అంతకు ముందు రానా క్రిష్ దర్శత్వంలో కృష్ణం వందే జగద్గురుమ్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో రానా నట విశ్వరూపమే ప్రదర్శించాడు. రానా నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి గారు చూశారని.. చూసిన వెంటనే 'బాహుబలి' సినిమాలో భల్లాల దేవుడు పాత్రకు తనని ఎంపిక చేశారని రానా వివరించాడు.

 

'లీడర్' సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములకు ఎప్పుడూ రుణపడి ఉంటానని.. తన కెరీర్ ప్రారంభ దశలో హ్యాట్రిక్ ఫ్లాప్‌లు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నాడో చెప్పుకొచ్చాడు. రానా ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాషల్లో 'అరణ్య' అనే పాన్ ఇండియాలో నటిస్తున్నాడు. ప్రభు సాలోమన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం తెలుగులో 'అరణ్య'.. తమిళంలో 'కాదన్‌'.. హిందీలో 'హాథీ మేరే సాథీ'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కి మంచి స్పందన వచ్చింది. మానవులు - జంతువులను ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి 'బన్ దేవ్' పాత్రలో నటిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: