లాక్‌డౌన్ చిత్ర విచిత్ర వేషాల‌తో పాటు క్ష‌ణికావేశ నిర్ణ‌యాల‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లేదా హంత‌కులుగా మారుతున్నారు. గ‌డిచిన ప‌దిహేను రోజుల్లో  ఇలాంటి సంఘ‌ట‌న‌లతోనే క్రైం పెరుగుతున్న‌ట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా కరోనా మహమ్మారి వేళ బయట తిరగొద్దు.. రోజులు బాగాలేవు.. వైరస్‌ సోకితే ప్రాణాలు పోతాయని భార్య జాగ్ర‌త్త‌లు చెప్ప‌డంపై  ఆ వృద్ధుడు తీవ్ర మ‌నోవేద‌న‌కు లోన‌య్యాడు. భార్య తనను ప్రశ్నించడమేంటని మనస్తాపం చెందిన వృద్ధుడు బుధవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు.

 

ఈ విషాద సంఘ‌ట‌న సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో జ‌రిగింది. రాయపోల్‌ ఎస్‌ఐ షేక్ విలేఖ‌రుల‌కు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..  గ్రామానికి చెందిన మంద రాములు (60) కుమారుడు రాజుతో కలిసి గజ్వేల్‌లో ఎరువుల దుకాణం న‌డుపుతున్నాడు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో రాములు  స్వగ్రామమైన లింగారెడ్డిపల్లికి వ‌చ్చాడు. మిగ‌తా కుటుంబ స‌భ్యులు కూడా ఇంటికి చేరుకున్నారు. స్వ‌గ్రామంలో తెలిసిన వారితో ముచ్చ‌టించేందుకు రాములు అంద‌రితో క‌లివిడిగా తిరుగుతున్నాడు. ఇది న‌చ్చ‌ని అత‌ని భార్య కాస్త ప‌రిస్థితి బాగోలేదు..జాగ్ర‌త్త‌గా ఇంటిప‌ట్టునే ఉండాల‌ని సూచించింది.

 

అయితే ముందు భార్య మాట‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. మంగళవారం గజ్వేల్‌లో కూడా వెళ్లి వచ్చాడు. దీంతో రాములు భార్య అంజమ్మ.. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో బయట తిర‌గటం మంచింది కాదు..టీవీల్లో చెబుతున్న‌ది నీకు అర్థం కావ‌డం లేదంటూ భ‌ర్త‌కు చెప్పింది. అయితే ఈ విష‌య‌మై  భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య  తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. భార్య అన్న మాట‌ల‌ను త‌లుచుకుంటూ రాములు మ‌న‌సులో బాగా కుమిలిపోయాడు. మనస్తాపం చెందిన వృద్ధుడు బుధవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: