యనమల రామకృష్ణుడు.. తెలుగు దేశం పార్టీలో పెద్ద మేధావిగా చెబుతారు. లా పాయింట్లు పట్టడంలో దిట్ట అంటారు. ఎన్టీఆర్ కాలంలో స్పీకర్ గానూ పని చేయడం వల్ల కాస్త విషయ పరిజ్ఞానం కూడా ఎక్కువే. కానీ ఇటీవలి కాలంలో ఆయన వాదనలు చూస్తుంటే.. ఈ యనమల... ఆ యనమలేనా అనిపించక మానదంటున్నారు విశ్లేషకులు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి.. ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి అన్నట్టు మొక్కుబడిగా ఉంటున్నాయి యనమల ఆరోపణలు.

 

 

తాజాగా ఆయన చేస్తున్న ఆరోపణ ఏంటంటే.. మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏపీలో పెరిగినంతగా పెరగడం లేదు. జగన్ సర్కారు దృష్టి పెట్టడం లేదు అని... ఇతర రాష్ట్రాలలో కరోనా వైరస్ పెరగడం లేదని, ఏపీలో మాత్రమే పెరుగుతోందని చెబుతున్నారు. అంతే కాదు ఏపీలో వైసీపీ నేతల వల్లే... జగన్ కారణంగానే కరోనా వ్యాప్తి చెందిందని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. అంతే కాదు.. కరోనా కట్టడికి పొరుగు రాష్ట్రాలు చిత్తశుద్ధి చూపాయని, కాబట్టే అక్కడ కేసులు పెరగడంలేదని యనమల తేల్చిపారేశారు.

 

 

ఇంకా యనమల ఏమంటున్నారంటే.. ఏపీలో ముందుచూపు లేక కేసులు పెరుగుతున్నాయట. కరోనా పట్ల అన్ని రాష్ట్రాలు, దేశాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటే.. జగన్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందట. రాపిడ్ కిట్ల కొనుగోలులో అవినీతి బయటపడిందట. ఇంకా మిగిలిన నాయకులు చేసే రొటీన్ ఆరోపణలే చేశారు యనమల.

 

 

అయితే యనమల విమర్శలకూ దేశంలోని కరోనా లెక్కలకూ పొంతనే లేదని చెప్పాలి. దేశంలో ఓ పక్క మహారాష్ట్ర, తమిళనాడు, మద్యప్రదేశ్ , గుజరాత్, రాజస్తాన్, డిల్లీల్లో రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. యనమల ఏమో.. ఏపీలోనే ఎక్కువ. ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరగడం లేదు అంటున్నారు. ఈ విమర్శలు చూస్తే.. మేధావి మేధావి అన్నారు.. మరి ఈ యనమలకు ఏమైందబ్బా.. ఇలా మాట్లాడుతున్నారు..? అనుకుంటున్నారు ఆంధ్రాజనం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: