భారతదేశంలో లాక్ డౌన్ అమలవుతున్న రోజు నుండి ప్రతి రాష్ట్రంలో అనేకమంది పోలీసులు అత్యుత్సాహం చూపుతూ సామాన్య ప్రజలను అతి కిరాతకంగా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మైన కఠిన శిక్షలను ప్రజలకు విధించి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు తమ ప్రవర్తన మాత్రం అసలు మార్చుకోవడం లేదు. తాజాగా బీహార్ లో ఏకంగా ఒక హోంగార్డు పరువు ని నలుగురిలో సమక్షంలో పూర్తిగా తీసేసి సస్పెండ్ కాబడిన ఏఎస్ఐ గురించి వార్తలు వెల్లువెత్తుతున్నాయి.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... బీహార్‌ లోని అరియారియా జిల్లా లో ఎటువంటి పాస్ లేకుండా ప్రయాణిస్తున్న ఇద్దరు అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆపాడు ఓ హోమ్ గార్డ్. అయితే ఆ సందర్భంలోనే హోంగార్డ్ గణేష్ లాల్... అగ్రికల్చర్ ఆఫీసర్ మనోజ్ కుమార్, తన సహోద్యోగి మధ్య కాస్త మాటల యుద్ధం కొనసాగింది. ఇది గమనించిన ఏఎస్ఐ గోవింద సింగ్ హోంగార్డు ని తిడుతూ అతనిని 50 గుంజీలు తీయించాడు. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ మనోజ్ కుమార్ కి క్షమాపణ తెలపాలంటూ ఆదేశించాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాన్ని ప్రస్తుతం నెట్టింట వైరల్ కాగా... ఉన్నత పోలీసు అధికారులు ఎఎస్ఐ వేటు వేశారు. ఒక విధి నిర్వహణలో ఉన్న హోం గార్డ్ ని కించపరిచేలా ప్రవర్తించడం ఎంత మాత్రం సరికాదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుప్తేశ్వర్ పాండే ఎడిషనల్ ఎస్సై పై మండిపడ్డారు.


ఆయన మాట్లాడుతూ... 'జాకీ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోమ్ గార్డ్ పై జరిగిన అవమానకరమైన సంఘటన ఖండించి తగినది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఎడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన గోవింద సింగ్ ని సస్పెండ్ చేస్తున్నాం', అని తెలిపారు. ఏదేమైనా హోంగార్డు గణేష్ లాల్ కు జరిగిన సంఘటనను ఎవరికీ జరగకూడదని తోటి సహోద్యోగులు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: