ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా  భయం కనిపిస్తున్న విషయం తెలిసిందే. చాలామంది కరోనా దరిచేరకుండా  తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇతరుల కారణంగా చాలామంది కరుణ వైరస్ బారిన పడాల్సినా పరిస్థితి వస్తుంది . వేరొకరు చేసిన తప్పు కి మరొకరు బలి ఇవ్వడం అంటే ఇదేనేమో. ఢిల్లీలో జరిగిన మార్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి కరోనా  వైరస్ సోకిన విషయం తెలిసిందే. మర్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత ముస్లిం సోదరులు అందరూ చాలా మటుకు కరోనా బారినపడి ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే మర్కజ్ వెళ్లిన ముస్లిం సోదరులకు కరోనా రావటమే.. కాదు వారి కారణంగా మరింత మంది కరోనా  వైరస్ బారిన పడాల్సినా పరిస్థితి ఏర్పడింది.తాజాగా ఇక్కడ  కూడా ఇలాంటి ఘటన జరిగింది.మర్కజ్ ముస్లిం ల కారణంగా  ఓ యువకుడికి కరోనా  వైరస్ సోకింది.

 

 

 కృష్ణా జిల్లాలోని రెడ్డి గూడెంలో ఓ యువకుడికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం రేపింది. మర్కజ్ వెళ్లిన ముస్లిములు ప్రయాణించిన  రైలులో ప్రయాణించిన ఆ యువకుడు మొదట కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది  కానీ 28 రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయగా కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.  వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మార్కస్ ముస్లింలు రైల్లో ప్రయాణం చేశారు... ఇక అదే రైలులో మార్చి 15వ తేదీన ఓ యువకుడు రెడ్డిగూడెం కు మామిడి కాయల ప్యాకింగ్ నిమిత్తం వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతనిని క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించగా మొదట నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ 28 రోజుల తర్వాత అతడి లో వైరస్ లక్షణాలు కనిపించడంతో మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని బయటపడడంతో స్థానిక ప్రజలు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

 

 దీంతో వెంటనే అప్రమత్తమై పోయిన అధికారులు సదరు యువకుడు ఏఏ గ్రామాలలో సంచరించి ఉంటాడని.. ఎవరెవరిని కలిసి ఉంటాడు అనేదానిపై ప్రస్తుత వివరాలు సేకరిస్తున్నారు. అయితే కరోనా  వైరస్ లక్షణాలు బయట పడిన ఆ యువకుడు రెడ్డిగూడెం సహా రంగాపురం గ్రామం లో కూడా సంచరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు గ్రామాలు భయం గుప్పిట్లో బతుకుతున్నాయి. ఆ యువకుడి కారణంగా కరోనా వైరస్ సోకింది అనే అనుమానంతో బతుకుతున్నారు చాలామంది.

మరింత సమాచారం తెలుసుకోండి: