ఓవైపు రోజు రోజుకు  టెక్నాలజీ పెరుగుతోంది. ప్రపంచం మొత్తం ఆధునిక పోకడలకు వెళ్తుంది. మనిషి అరచేతిలోకి  ప్రపంచం మొత్తం వచ్చేసింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో కళ్లముందు కనిపిస్తోంది. ఇలా కాలం మారుతుంది కానీ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఆ మూడ నమ్మకాలే ఇక్కడ ఒక కుటుంబం ప్రాణాలు తీసాయి. క్షుద్ర పూజల తో  ఏళ్ల తరబడి బాధపడుతున్నామని మనస్తాపం చెందిన కుటుంబంలోని అందరు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే బడంగ్పేట్ పరిధిలోని అల్మాస్గూడ లో విషాద ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం డోర్నకల్ గ్రామానికి చెందిన సువర్ణ బాబుకి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. 

 

 

 ఈ కుటుంబం రెండేళ్ల క్రితం బడంగ్పేట నగర పాలక సంస్థ పరిధిలోని అల్మాస్ గూడా శ్రీ సాయి తేజ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే కూతురు స్వప్న ఇంట్లో తల్లితో కలిసి ఉంటుండగా..  కుమారుడు హరీష్, గిరీష్ లు  ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈ కుటుంబం గత కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఎంత మంది వైద్యుల దగ్గరికి తిరిగినప్పటికీ అనారోగ్యం మాత్రం నయం కాకపోవడం తో చేతబడి కారణంగానే అనారోగ్యం పాలవుతున్నాము  అంటూ ఆ కుటుంబం భావించింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆలయాలు బాబాల చుట్టూ తిరిగి ఎన్నో పూజలు కూడా చేయించారు. భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. 

 

 

 ఇక ఈ పూజలు చేయించడానికి ఏకంగా ఇల్లు బంగారం లాంటి తమ దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. ఓ వైపు ఉన్న ఆస్తులన్నీ అమ్మేయడం మరోవైపు ఆరోగ్యం కుదుట పడకపోవడం.. ఇంకోవైపు పూర్తిగా అప్పుల పాలవడంతో ఏం చేయాలో పాలుపోక తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో బలవన్మరణం ఒక్కటే దిక్కు అనుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక రెండు రోజుల నుండి ఈ  కుటుంబీకులు ఎవరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు కిటికీ  తెరిచి గమనించడం తో మృతదేహాలు కనిపించగానే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని లోపలికి వెళ్లి చూడక అక్కడ మృతదేహాలు ఒక లెటర్ దొరికి ఇదంతా ఆ లెటర్ లో రాసి ఉంది. అయితే లోపల బెడ్రూమ్ లో మంచం పై అందరి మృతదేహాలు ఉండగా బయట హల్లో  హరీష్ రావు మృతదేహం చీరకు వేలాడుతూ కనిపించింది. అంటే అందరికీ ఉరి వేసిన అనంతరం చివరికి హరీష్ రావు  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: