తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా వైరస్ నియంత్రణకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వలు . ఇదిలా ఉంటే మలేరియా కు సంబంధించిన హైడ్రోక్సీక్లోరోక్విన్  మందు కరోనా  వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొ కలుగుతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది హైడ్రోక్సీక్లోరోక్విన్  మందులు అధిక మోతాదులో వాడి  ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైడ్రోక్సీక్లోరోక్విన్ మందు  విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మెడికల్ షాప్ లో కూడా మలేరియా వ్యాధికి సంబంధించిన మందు హైడ్రోక్సీక్లోరోక్విన్  మందును ప్రజలకు విక్రయించే రాదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. కేవలం వైద్యులు సూచిస్తే తప్ప ప్రజలకు  ఈ మందును అమ్మకూడదు అంటూ స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ 19 నోడల్ అధికారి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎవరికైనా కరోనా వైరస్ సోకిన  వారికి మాత్రమే హైడ్రోక్సీక్లోరోక్విన్  మందులు ఉపయోగించాలని...లేదా  కరోనా  సోకిన వారి కుటుంబీకులు ఈ మందులు వాడాలి  అంటూ తెలిపింది. వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చినప్పుడు మాత్రమే మెడికల్ షాపు నిర్వాహకులు ఈ మందును  ప్రజలకు విక్రయించాలని సూచించింది. 

 

 

 మిగతా ప్రజలెవ్వరు  మలేరియా మందైనా హైడ్రోక్సీక్లోరోక్విన్  మందును వాడరాదు అంటూ సూచించింది. అయితే ప్రస్తుతం ఇండియాలో మలేరియా వ్యాధికి  వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్  ముందు ప్రపంచ వ్యాప్తంగా సంజీవనిగా మారుతున్న విషయం తెల్సిందే. అయితే ఎప్పటికప్పుడు వైద్యులు ఈ మందును సాధారణ ప్రజలు వాడొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. వైద్యుల అనుమతి ఉంటేనే... ఈ మందును వాడాలి అని అంతేకాకుండా ఎంత మోతాదులో వాడాలో వైద్యులు సూచిస్తారు అంటూ తెలుపుతున్నారు. ఇష్టానుసారంగా ఈ మందు వాడటం ద్వారా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ భయంతో ఈ మందులు వాడడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: