కరోనా వైరస్ ను కంట్రోల్ చేసే ఉద్దేశంలో భాగంగా విధించిన లాక్ డౌన్ నిబంధనను సమర్థవంతంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల కంటే మరిన్ని కఠిన నిబంధనలు రూపొందించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. ఏదో ఒకరకంగా కరొనను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఆ నిబంధనలు ఏవీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం పై కేంద్రం అనేకసార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇటీవల కేంద్ర హోంశాఖ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా అక్కడ ప్రతిపక్ష బిజెపి నాయకులు మత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లుగా ప్రజల్లో కూడా ఆగ్రహం పెరిగిపోతుండడంతో ఆత్మరక్షణలో పడిపోయింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించాలంటూ వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ను మమతా బెనర్జీ సంప్రదించినట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఆయన పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా 'బంగ్లార్ గార్బో మమత ' కార్యక్రమం కూడా వాయిదా పడడంతో ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ కి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మమతా బెనర్జీ ప్రభుత్వం కరోనా విషయంలో అనేక ఇబ్బందులు పడడంతో ఆయనను ఆకస్మాత్తుగా కోల్ కతా రావాల్సిందిగా పిలుపు రావడంతో కార్గో విమానంలో ఆయన పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. పీకే వచ్చిన సమయానికి రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్రం పంపించిన మినిస్టీరియల్ సెంట్రల్ టీం సభ్యులు కూడా  కోల్ కతా చేరుకున్నారు. ప్రస్తుతం పీకే టీమ్ కరోనా విషయంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు పెరగకుండా చూడడంతో పాటు, మీడియాలోనూ మమత ప్రభుత్వం పై ఎటువంటి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిజెపి ఐటీ విభాగం మమతా బెనర్జీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రొల్ చేస్తోంది.


 రాష్ట్రంలో పది లక్షల మందికి కేవలం 198 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేయడంపై బిజెపి మమతా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యవసర వస్తువులను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వాడుకుంటున్నారని, మండిపడుతున్నారు. అంతేకకుండా లాక్ డౌన్ సమయంలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తబ్లిగి జమాత్ కి వెళ్లి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉండకుండా మమత వారికి అండగా ఉంటుందని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ప్రజల్లోనూ ఇదే రకమైన భావం కలుగుతుండడంతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం తమకు చేటు చేస్తుందని భావిస్తున్న మమత అకస్మాత్తుగా పీకేను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: