ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.. ఇప్పటికే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.. దీంతో ప్రజలందరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.. అయితే ఇప్పుడు ఎంతోమంది మహిళలకు.. పెళ్లి అయ్యి పిల్లల కోసం ఎదురు చూస్తున్నా వారి అందరి ప్రశ్న ఒకటే.. ఈ సమయంలో పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చా? ప్రగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా అని ఆలోచిస్తున్నారు.. 

 

అయితే ఇందుకు నో అనే సమాధానం చెప్తున్నారు డాక్టర్లు.. ఇండియన్ సొసైటీ అఫ్ అసిస్టెంట్ రీప్రొడెక్షన్ వారు గైడ్ లైన్స్ ఇస్తున్నారు.. అసలు వారు ఎం అంటున్నారు అంటే.. ప్రెగ్నెన్సీ అనేది సహజంగా వస్తే సమస్య లేదు కానీ.. సహజంగా కాకుండా డాక్టర్స్ ట్రీట్మెంట్ వంటివి తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని.. అందుకు అని ఈ సమయంలో ఓ మూడు లేదా నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకోకపోవడమే మంచిది అని అంటున్నారు.  

 

అంతేకాదు.. ఈ కరోనా వైరస్ సమయంలో వైద్య సిబ్బంది కొరత కూడా ఎక్కువగా ఉంది అని.. ఎందుకంటే వైద్య సిబ్బందిలో వయసు అయినా వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు అని.. మిగితా వారిలో ప్రయాణం ఇబ్బంది అయ్యి ఇంటికే పరిమితం అవుతున్నారు అని.. మిగితావారు అంత కూడా కరోనా పేషెంట్లకు సేవలు చేసి ఖ్వారంటైన్ కి వెళ్తున్నారు అని వైద్యులు చెప్తున్నారు.. ప్రస్తుతం వైద్యసిబ్బంది కొరత కూడా ఏర్పడింది అని అయన పేర్కొన్నారు.. అయితే నిజానికి ఈ కరోనా సమయంలో పిల్లలు కోసం ప్రయత్నాలు చేయకపోవడమే మంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: