గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే అక్కడ పోలీసు అధికారులు లాక్ డౌన్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకి వస్తే వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు పోలీసులు. రోడ్ల మీదకి వచ్చే వారిపై కేసులు నమోదు అవుతున్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఇవన్నీ అసలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైనే తిరుగుతున్నారు. దీంతో జిల్లా పోలీసు అధికారులు... మానసికంగా ఇబ్బంది కలిగించే శిక్షలను విధిస్తూ సూపర్ గా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.


ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కొల్లూరు ఎస్సై లాక్ డౌన్ ఉల్లంఘించే ప్రజలకు ఓ అద్భుతమైన పనిష్మెంట్ ఇస్తూ సర్వత్ర ప్రశంసలను అందుకుంటున్నారు. ఆ ఎస్ఐ కొల్లూరు మండలం లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో "నేను మూర్ఖుడిని. నేను మాస్క్ పెట్టుకోను. నేను సమాజానికి శత్రువుని. ఏ పనీ పాటా లేకుండా రోడ్లమీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను" అని రాసిపెట్టి ఉంది. ఆ తర్వాత ఎవరైతే తమకు ముఖ్యమైన పనులు లేనప్పటికీ లాక్ డౌన్ నిబంధనలను బ్రేక్ చేసి రోడ్లమీదకు వచ్చారో... వాళ్లందరినీ ఫ్లెక్సీ బోర్డు వద్ద నిల్చోపెట్టి సెల్ఫీ తీసుకునేలా ఆదేశిస్తున్నారు.


అనంతరం అదే ప్రాంతంలో అక్కడికక్కడే ఆ సెల్ఫీ ఫోటో ని రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తుల ద్వారానే తమ తమ వాట్సాప్, ఫేసుబుక్ ఖాతాలలో 24 గంటల పాటు కనిపించే లాగా స్టేటస్, అలాగే ప్రొఫైల్ పిక్ లాగా కూడా అప్డేట్ చేయించారు. ఇది చాలదన్నట్టు వారి వాట్సాప్ స్నేహితుల గ్రూపులలో కూడా సెల్ఫీ ఫోటోలను సెండ్ చేయించారు. ఇలా చేస్తే జనానికి కాస్త ఐనా బుద్ధి వస్తుందని సదరు ఎస్ఐ చెప్పుకొస్తున్నారు. మీ పనిష్మెంట్ ని మినహాయించి లాక్ డౌన్ ఉల్లంఘించిన వారందరి చేత 500 సార్లు "మేము తప్పు చేశాము" అని రాయించడం జరిగింది. చేసేదేమీ దాకా దాదాపు 30 నిమిషాల పాటు ఎర్రటి ఎండలో నిల్చొని ఏమి తప్పు చేశాను అని పెన్ను పేపరు పట్టుకొని ద్విచక్ర వాహన దారులు రాయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఒక దెబ్బ కొట్టడం కంటే ఇలాంటి పనిష్మెంట్స్ ఇవ్వడం వలన ప్రజలలో మార్పు వస్తుందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: