పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన. పార్టీ పెట్టి ఆరేళ్ళైంది. సొంతంగా 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేశాడు. రెండు చోట్లా ఓడిపోయాడు. అయితే పవన్ గత ఏడాదిగా పార్టీని నడుపుతున్నాడు. 2024 ఎన్నికలనే టార్గెట్ గా మార్చుకుని బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకున్నాడు కూడా. మరో వైపు పార్టీకి గ్లామర్, గ్రామర్, ఆర్ధిక బలం అద్దేందుకు మళ్ళీ ముఖానికి పవన్ రంగు పూసుకున్నాడు.

 

ఈ టైంలో పవన్ పార్టీ గురిని మెగాస్టార్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చిరంజీవి ఆ ఇంటర్వ్యూలో తన రాజకీయం జీవితంపైన కూడా చెప్పుకుంటూ వచ్చారు. తాను ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పరిస్థితులు వేరు. అప్పట్లో తన ఏజ్ కూడా వేరు. తాను రాజకీయంగా కేంద్ర మంత్రి దాకా ఎదిగానని, టూరిజం మంత్రిగా సంత్రుప్తికరంగా పనిచేశానని కూడా చెప్పుకున్నారు. ఇక ఇపుడు మళ్ళీ పాలిటిక్స్ వైపునకు వచ్చే చాన్సే లేదన్నారు.

 

ఇక పవన్ జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయలనుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. పవన్ పట్టుదల గలవారని, ఆయన ఇపుడు రాజకీయాల్లో ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నా కూడా అవే ఆయనకు ఏది మంచి, చెడూ కూడా నేర్పుతున్నాయని అన్నారు. గత అనుభవాలతో పవన్ రాజకీయంగా నిలదొక్కుకుని సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అవుతాడన్న నమ్మకాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.

 

ఏదోనాటికి పవన్ ప్రజల మద్దతు పొంది తాను కోరుకున్న విధంగా అంటే ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకాన్ని కూడా చిరంజీవి వ్యక్తం చేశారు. ఇక ఒక అన్నగా తన మద్దతు ఎపుడూ జనసేన పార్టీకే అని కూడా చిరంజీవి పక్కా క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద అన్న గారి దీవించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని. మరి అభిమానులకు ఇది హ్యాపీ న్యూసే. ఇక వెయిట్ చేయడమే తరువాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: