జగన్ కి చరిత్రలో కనీ వినీ ఎరుగని మెజారిటీ వచ్చింది. జగన్ 151 సీట్లతో అధికారం హస్తగతం చేసుకున్నారు. పైగా యాభై శాతం ఓట్ల షేర్ ఈ మధ్యకాలంలో సంపాదించడం కష్టం. ఎందుకంటే ఇప్పటి తరంలో  ప్రజల ఆలోచనలు బాగా పెరిగాయి.మారాయి. చైతన్యం వచ్చిన 2019 కాలానికి కూడా ఇంత వ్యక్తిగత ఆరాధన ఉండడం అంటే నిజంగా గ్రేటే.

 

అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే టీడీపీ నుంచి విష  ప్రచారం ఒకటి  మొదలైంది. అదేంటి అంటే 2022 నాటికి జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి. అందువల్ల జగన్ మూడేళ్ళ సీఎం అని. అయితే ఆ తరువాత బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోవడంతో ఆ ఊసు లేకుండా పోయింది. ఇక ఇపుడు కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని మోడీ మళ్ళీ నంబర్ వన్ లీడర్ అయ్యాడు. ఆయన ఉండబట్టే ఈ దేశంలో కరోనా అదుపులో ఉందన్న భావన కూడా కలుగుతోంది.

 

జనాలు సైతం మోడీ మాట వేదంగా భావిస్తున్నారు. లేకపోతే ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ఇన్ని రోజుల పాటు ఇంట్లో ఉంటారా. ఇది నిజంగా మోడీ మహిమే. మోడీ ఒక్కడే లీడర్ అని యావత్తు ప్రపంచంలో కూడా గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది. ఈ నేపధ్యంలో మోడీ దేశంలో పరిస్థితులు అన్నీ చక్కబడ్డాక జమిలి ఎనికలకు 2022 లో వెళ్తారని కూడా టాక్ మొదలైంది.

 

ఎందుకంటే 2024 నాటికి దేశంలో ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, కాబట్టి జనాల్లో వేవ్ ఉండగానే ఎన్నికలు పెట్టాలని మోడీ అనుకుంటే మాత్రం మళ్ళీ ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే ఏపీలో జగన్ సర్కార్ రెండేళ్ళే అని టీడీపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు.

 

ఆయన ఈ మేరకు జోస్యం చెబుతున్నారు. జగన్ సర్కార్ని జనాలు భరించడం కష్టమని, అందువల్ల కేంద్రం తొందరగా ఎన్నికలు పెట్టేస్తే చంద్రబాబే మళ్ళీ సీఎం అని కూడా ఆయన విశాఖ ఆక్టోపస్ గా జోస్యం చెబుతున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: