ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 200 దేశాలకు పైగా కేవలం నాలుగే నాలుగు నెలల్లో వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెందుతున్న విషయంలో కరోనా వైరస్ చాలామంది ప్రాణాలను బలితీసుకుంది. ఇటలీ మరియు స్పెయిన్ అదేవిధంగా అమెరికా దేశాలలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులను నెలకొల్పింది. ఇటువంటి తరుణంలో భారతదేశంలో కూడా ఈ వైరస్ చాపకింద నీరులా రోజురోజుకీ బలపడుతోంది. మొదటి దశ లాక్ డౌన్ కార్యక్రమంతో వైరస్ అదుపులోకి వస్తుందని భావించిన...ఉన్న కొద్ది పాజిటివ్ కేసులు పెరుగుతూనే వచ్చాయి. ఈ దెబ్బతో ప్రధాని మోడీ లాక్ డౌన్ పొడిగించారు.

 

ప్రస్తుతం భారతదేశం రెండో దశ చివరిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే కరోనా వైరస్ మొత్తం నాలుగు దశల్లో దాని ప్రభావం చూపుతుంది. మొదటి దశలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, రెండో దశలో వారి నుంచి ఈ వ్యాధి కుటుంబ సభ్యులకు స్వాగతం, మూడో దశ అంటే ఎవరి ద్వారా ఈ వైరస్ సోకింది అర్థంకాని పరిస్థితి నెలకొనడం, నాలుగో దశ అంటే ప్రళయమే. ప్రస్తుతం భారతదేశం మూడో దశలో కి వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు వైద్య నిపుణులు అంటున్నారు.

 

ఇలాంటి సమయంలో లాక్ డౌన్ నీ ఎత్తేస్తే భారతదేశం వల్లకాడుగా మారిపోతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతి చిన్న భూభాగంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో వైరస్ చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుందని...కాబట్టి ఉన్న లాక్ డౌన్ నీ వచ్చే జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కరోనా వైరస్ పోరాటం విషయంలో ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే భారత్ ఇప్పటివరకు బాగా పోరాడిందని...ఇంకా పోరాడి విజయం సాధించాలని కోరుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: