కరోనాని కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటున్నారు. ఇంకా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో, వ్యవసాయ, చిన్న తరహా పరిశ్రమలకు లాక్ డౌన్ సడలింపు ఇచ్చారు.

 

అయితే కరోనాపై కేంద్రం చేస్తున్న పోరాటానికి అన్ని రాష్ట్రాల సీఎంలు సహకరిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా మోదీకి సపోర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడానని చెబుతూ, కేంద్ర ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇస్తున్నారు. అలాగే తమ పార్టీ నేతలకు కూడా కేంద్రంపై విమర్సలు చేయకుండా, మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.

 

ఇక రాహుల్ అలా మోదీకి సపోర్ట్ గా ఉంటే సోనియా గాంధీ మాత్రం రివర్స్ లో మోదీ ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల పేదలు, రైతులు, రైతు కూలీలు, వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర రంగాల్లో పని చేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. అయితే ఇలా ప్రజలు గురించి బాగానే మాట్లాడిన సోనియా, మతపరమైన విమర్సలు చేశారు.

 

కరోనా పేరుతో బీజేపీ ద్వేషము, మతతత్వమనే వైరస్‌లను వ్యాపింప చేస్తోందని ఆరోపించారు. అసలు ఇలాంటి టైంలో సోనియా మతపరమైన ఆరోపణ చేయడంతో బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోనియా వ్యాఖ్యలపై కేంద్ర ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. తామేమీ మతపరమైన విభజన చేయడం లేదని, ఐకమత్యంతో కరోనాపై పోరాడుతున్నామని,  మీరు చిల్లర రాజకీయాలు చేయకుంటే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

 

వాస్తవానికి మంత్రి చెప్పిన మాటల్లో కాస్త వాస్తవం ఉన్నట్లే ఉంది. వారు అందరిని కలుపుకుని పోతూ కరోనాపై యుద్ధం చేస్తున్నారు. అయినా సరే సోనియా మతపరమైన విమర్సలు చేయడం షాకింగ్ కలిగించే విషయం. ఏదేమైనా ఇలాంటి టైంలో రాజకీయం చేయొద్దన్న రాహుల్ మాట సోనియా వినిపించుకున్నట్లు లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: