కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాల నాయకులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా డబ్బు ఉన్నా, టెక్నాలజీ పరంగా జ్ఞానం ఉన్నా గాని వైరస్ ని ఏం చేయలేక చేతులెత్తేస్తున్నారు. భారతదేశంలో కూడా వైరస్ ప్రభావం చాలా ప్రమాదకరంగానే రోజురోజుకి మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చాపకింద నీరులాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ ఊహించని విధంగా బయటపడుతున్నాయి.

 

ఇలాంటి టైమ్ లో వైసీపీ పార్టీలో అత్యుత్సాహం కలిగిన నాయకులు చేస్తున్న పనుల వల్ల కూడా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు మరి ఎక్కువగా నమోదు అవుతున్నవి. పూర్తి విషయం లోకి వెళ్తే  వైసిపి పార్టీ ఎమ్మెల్యే ఒకరు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ కోసం పోరాడుతున్న వైద్యులను మరియు అదే విధంగా ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చిన దాతల ఫోటోలను తన నియోజకవర్గంలో ట్రాక్టర్ పై ర్యాలీగా ఊరేగించడం జరిగింది. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న ఒక వ్యక్తి కి  కరోనా వైరస్ ఉండటంతో ఆ వ్యక్తి వల్ల మరికొంతమందికి వైరస్ సోకిందంట.

 

ఈ విషయం నేషనల్ మీడియాలో బయటపడింది. దీంతో నేషనల్ మీడియా వైసిపి పార్టీ ఎమ్మెల్యే నిర్వహించిన కార్యక్రమాన్ని చూపిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు  చేస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే  ఏపీ సర్కార్ వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా పెద్దలు రెస్పాండ్ అవ్వకపోతే జాతీయస్థాయిలో ప్రభుత్వం పై పెద్ద మచ్చ పడేలా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: