ఉరుకుల పరుగుల ప్రపంచంలో మంచి అనే మాట విని చాలా కాలం అయ్యింది భయ్యా..పూర్వం మన పెద్దోళ్ళు మంచిగా ఉండు..మంచిగా మాట్లాడు..మంచి విను..మంచిని పంచు అంటూ దగ్గర కూర్చోపెట్టుకుని  మరీ బుర్రలోకి ఎక్కించేసేవారు...చదువుకంటే  కూడా ముందు మంచి సంస్కారం ఉంటే మిగిలినవి అన్నీ వాటంతట అవే వచ్చేస్తాయిలే అంటూ జీవిత గమ్యాన్ని చూపించేవారు . కానీ రాను రాను మంచి కాస్తా పురావస్తు తవ్వకాలలో దొరికే అపురూప వస్తువుల్లా అప్పుడప్పుడు బయట పడుతోంది..

IHG

మంచిగా ఉండటం అంటే మనిషిగా బ్రతకడమే కదా...?? మరి మనం మనుషుల్లా బ్రతకడం లేదా అనే సందేహం రావచ్చు. అవును మనం మనిషిగానే బ్రతుకుతున్నాం..కానీ మంచి మనిషిగా నిరూపించుకోవడంలో మాత్రం వైఫల్యాని చవి చూస్తున్నాం. సాటి మనిషికి సాయం చేయాలనే ఆలోచన ఎప్పుడు  కలుగుతుందంటే...మనిషిగా సమాజాన్ని మానవీయ కోణంలో చూసిననాడే  అది సాధ్యమవుతుంది. సాయం చేసిన వాడికి మళ్ళీ తిరిగి సాయం చేయాలనే రూల్ లేదు..కానీ ప్రత్యుపకారం చేసిన వాడే మనిషిగా నిరూపించుకోబడుతాడు. ప్రస్తుతం రాజస్థాన్ లో పురావస్తు త్రవ్వకాలు జరపగా ఓ అద్భుతం బయటపడింది..

IHG

పురావస్తు త్రవ్వకాలలో అద్భుతమా నిధులు ఏమైనా బయటపడ్డాయా అంటే నిధులకంటే విలువైనవే అక్కడ గుర్తించారు అక్కడి గ్రామ ప్రజలు..అంతేకాదు భారత దేశం మొత్తం ఇప్పుడు ఆ గ్రామంలో జరిగిన అద్భుతం గురించే చర్చించుకుకుంటోంది. ఇంతకీ అక్కడ దొరికినవి ఏంటో తెలుసా. మానవత్వం, విశ్వాసం, అభిమానం , ప్రేమ, ఋణం..ఏంటి ఇవన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉందా..అవును మనలో చాలామంది గుండె లోతుల్లో దాచేసుకున్న..పాతేసుకున్న వెలకట్టలేని ఆస్తులు ఇవి..మరి అక్కడ ఎలా బయటపడ్డాయంటే..

IHG

రాజస్థాన్ లోని సికర్ జిల్లా అది..కరోనా కోరలు చాస్తున్న క్రమంలో ఓ రాష్ట్రానికి చెందిన వలస కూలీలని ఆ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న పాటశాలలో క్వారంటైన్ లో ఉంచారు. వారికి ఏ లోటు లేకుండా స్థానిక ప్రభుత్వం అన్ని రకాలా చర్యలు తీసుకుంటోంది. గ్రామ ప్రజలు, సర్పంచ్ కూడా వారికి అన్ని రకాల వసతులు సమకూర్చి పెడుతున్నారు. దాంతో క్వారంటైన్ లో ఉంటున వారికి ఆ ఊరిపై వారికి  ప్రేమ పెరిగింది. తమ అభిమానాన్ని చాటుకోవాలని, తిండి పెట్టిన వారి ఋణం తీర్చుకోవాలని మానవత్వం ఉన్న మనుషులుగా స్పందించారు.

IHG's Sikar paint ...

సహజంగా వారు పెయింటర్స్ కావడంతో తాము ఉంటున్న స్కూల్ కి ఎన్నో ఏళ్ళుగా రంగులు లేకుండా బోసిగా ఉందని గుర్తించి ఆ గ్రామ ప్రెసిడెంట్ తో చెప్పి రంగులు తెప్పించి చెకచెకా వేసేశారు. ఆ స్కూల్ చూసుకున్న గ్రామ ప్రజలు ఇది మన బడేనా అంటూ ఆశ్చర్యంగా చూశారు..గ్రామ పెద్ద మీరు రంగులు వేసినందుకు ఈ డబ్బులు ఉంచుకోండి అంటూ తమ అభిమానాన్ని చాటగా..మీరు చేసిన సాయంతో పోల్చితే ఇది చాలా చిన్నది. ఈ స్కూలుకే ఈ డబ్బులు ఖర్చు చేయండి అంటూ చేతులు జోడించి మరీ అందరికి కృతజ్ఞతలు తెలిపారట..ఇది విన్న మనసు పులకరించిపోయింది. మంచి ఇంకా బ్రతికే ఉంది మిత్రమా…

మరింత సమాచారం తెలుసుకోండి: