కరోనా వైరస్ కట్టడి చేయడంలో జగన్ సర్కార్ కొనుగోలు చేసిన రాపిడ్ టెస్టింగ్ కిట్స్ లో అవినీతి జరిగిందని కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి భారీ స్థాయిలో కౌంటర్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసినదే. చంద్రబాబుకి కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారని మధ్యలో సుజనా చౌదరి బేరం ఆడారని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో చేసిన విమర్శలు మనకందరికీ తెలిసినదే. స్వయంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ని అధికార పార్టీ నేతలు తిట్టిన గాని ఏపీ బిజెపి నాయకులు ఎవరు స్పందించక పోవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

చాలావరకూ ఏపీ బీజేపీ లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు. ఒకటి కన్నా లక్ష్మీనారాయణ వర్గం అయితే మరొకటి జాతీయ బీజేపీ  నేతగా పేరొందిన జీవీఎల్ వర్గం. ఈ రెండు వర్గాలకు అసలు పడదని వార్తలు వినబడుతున్నాయి. జీవీఎల్ వర్గంలో జాతీయ బిజెపి పార్టీ విధి విధానాలను అనుసరించే వాళ్ళు ఉంటే కన్నా లక్ష్మీనారాయణ వర్గంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాలను సైలెంట్ గా పాటించే, అమలు చేసే నాయకులు ఉన్నారనే బలమైన వార్తలు వినబడుతున్నాయి. ఇందువల్లనే వైసీపీ పార్టీ నాయకులు భయంకరంగా విమర్శలు చేసినా...రాష్ట్ర బీజేపీ లో ఎవరు కన్నా లక్ష్మీనారాయణ ని డిఫెండ్  చేయలేదు అన్న టాక్ నడుస్తోంది.

 

ఇంకోపక్క విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ముందుగా బీజేపీ  హైకమాండ్ కి తెలియజేశారట. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తీవ్ర స్థాయిలో కన్నా నీ విమర్శలు చేశారట. దీంతో అటూ హైకమాండ్ సహకరించకపోవడం మరియు రా సొంత పార్టీ నేతలు కూడా ఈ విషయంలో పట్టించుకోకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ ఇది అలాంటి ఇలాంటి దెబ్బ కాదు భారీ దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి కోల్పోయే అవకాశం ఉందని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: