ప్రస్తుతం ప్రపంచ దేశాలలో  కరోనా  వైరస్  భయంతో చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే. అగ్ర రాజ్యాలు సైతం కరోనా వైరస్ పై పోరాటం చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇంకెంతమంది మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. రోజురోజుకు కరొనా  వైరస్ పాకడం  పెరిగిపోతుంది. అయితే ఈ  వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చైనా ప్రభుత్వం పై ప్రపంచ దేశాలు తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో ప్రశ్నలను కూడా చైనాపై కురిపిస్తున్నాయి ప్రపంచ దేశాలు

 

 

 మొదట కరోనా వైరస్ చైనాలోని వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ చైనాలో సత్వరంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందింది.. ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రత సలహాదారు తో పాటు అమెరికా దేశపు జాతీయ భద్రతా సలహాదారు కూడా చైనా ప్రభుత్వం పై ప్రశ్నల  వర్షం కురుస్తోంది. ఈ వైరస్  స్ప్రెడ్ అయ్యాక కుడా ప్రపంచ దేశాలకు పాకడానికి చైనా ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇది చైనా దేశం నుంచి బయటకి పొక్కకుండా ఉండి ఉంటే ప్రపంచ దేశాల సింపతీ చూపించి  మరింత ఆర్థిక సాయం చేసేది అంటున్నారు విశ్లేషకులు, 

 

 అలాగే కేవలం ఈ వైరస్ చైనా దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలకు ఎంతో మందిని బలి తీసుకుంటున్నా నేపథ్యంలో  ఇరుదేశాల జాతీయ భద్రత సలహాదారు లు నాలుగు రకాల ప్రశ్నలను చైనా ప్రభుత్వం ముందు ఉంచారు.ఉహన్  వైరాలజీ ల్యాబ్ లో కరోనా  వైరస్ టెస్టులు చేసారా  లేదా అంటూ ప్రశ్నించారు. మీరు అధికారికంగా చెప్పండి మా దగ్గర ఉన్న ఆధారాలను తర్వాత వెల్లడిస్తామని చెబుతున్నారు అమెరికా భారత్ లాంటి దేశాలు. అయితే కరోనా  వైరస్ ఒక వైరస్ కాదని మూడు రకాల వైరస్ల మిక్స్ అని ఇప్పటికే అమెరికాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే గబ్బిలాల నుంచి వస్తుందని చైనా చెబుతున్నప్పటికీ ఇప్పటికీ అక్కడ గబ్బిలాలను తింటుంటే ఇంకా   ఎందుకు వైరస్ రావటం లేదు అనే ప్రశ్న  చైనా ముందు ఉంచారు జాతీయ భద్రత సలహాదారు.

మరింత సమాచారం తెలుసుకోండి: