భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం అంతేకాకుండా కరోనా వైరస్ అనుమానితులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలను సత్వరంగా చేపట్టేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి కరోనా  వైరస్ టెస్టింగ్ కిట్ లను  దిగుమతి చేసుకుంటుంది భారత ప్రభుత్వం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న టెస్టింగ్ కిట్ల  విషయంలో పోటీ నెలకొంది.కరోనా ప్రాథమిక పరీక్షలకు  నిర్ధారణ పరీక్షలకు చైనా కు సంబంధించిన రాపిడ్ టెస్ట్  కిట్లు మేళా  లేదా దక్షిణ  కొరియా కు సంబంధించిన కిట్లు సరైనవా  అనేదానిపై ప్రస్తుతం దేశంలో పోటీ నెలకొంది. 

 

 భారతదేశంలో కరోనా  వైరస్ కు సంబంధించిన కిట్లు కొన్ని ఉండటం వల్ల.. చైనా నుండి  రాపిడ్ టెస్ట్ కిట్లను  భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. అయితే ఇది కరోనా వైరస్ నిర్దారణకు  ఎంత వరకూ ఉపయోగపడుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే రాపిడ్ టెస్ట్  కిట్  అనేది ఫైనల్ కాదు అన్నది కూడా ఐసీఎంఆర్ తో పాటు  ప్రపంచ స్థాయిలో అమెరికా దేశం కూడా నిర్దారించింది . మరి రాపిడ్ టెస్ట్ క్రికెట్లో దేనికోసం అంటే శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఏమైనా ఆకస్మాత్తుగా బయటకు వచ్చిందా అనే విషయాన్ని తేల్చడంతో పాటు వైరస్ శరీరంలో ఉందేమో అనే పరిశీలన చేసేందుకు  ఈ  టెస్ట్ కిట్లను  ఉపయోగిస్తారు

 

 ఇలా రాపిడ్ టెస్ట్ ద్వారా  చేసిన తర్వాత అనుమానం ఉంటే పరీక్షలు  చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టుకొని కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే చైనా ప్రభుత్వం తయారుచేసిన రాపిడ్ టెస్ట్ కిట్లను  ప్రభుత్వం ఐదు లక్షల వరకు దిగుమతి చేసుకుంది. ఇదే సందర్భంలో ఐసీఎమ్ఆర్ అప్రూవ్  చేసినటువంటి దక్షిణ కొరియాకు చెందిన కిట్లను కూడా దిగుమతి చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ దక్షిణ కొరియాకు చెందిన కిట్లే  వాడుతున్నారు. రాజస్థాన్ లో మాత్రం చైనా కు సంబంధించిన కిట్లు వాడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండు కిట్ల  మధ్య పోటీ ఏర్పడింది. అయితే చైనా కు సంబంధించిన కిట్ల  ద్వారా కేవలం ఐదున్నర పర్సెంట్ మాత్రమే ఉపయోగం ఉంది  తొంబై ఐదున్నర  శాతం సరైన  ఫలితాలు రావడం లేదు అంటూ తేలింది. దక్షిణ కొరియాకు చెందిన కిట్ల  విషయంలో అయితే ఇప్పుడు వరకు అసలు ఎలాంటి ఫలితాలు తేలలేదు.. మరి ఈ రెండు కిట్లలో భారత్లో కరోనా  వైరస్ నిర్ధారణకు ఏది  ఉపయోగపడతాయి అన్నది మాత్రం చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: