కరోనా మహమ్మారి విజృంభణకు ఆ దేశం.. ఈ దేశం అనే తేడా లేదు. అటు అమెరికా అయినా ఇటు రష్యా అయినా సరే .. కరోనా వ్యాప్తి మాత్రం జోరుగానే సాగుతోంది. ప్రపంచం అంతా చుట్టేసింది కరోనా.. కరోనా వేడి దేశాల్లో బతకలేదని మొదట్లో భావించారు. 26 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా ఉండదని భావించారు. కానీ.. ఇప్పుడు అలాంటి సీన్ ఎక్కడా కనిపించడం లేదు.

 

 

కరోనా కాటు కనిపించిన దేశాలే లేకుండా పోయాయి. అయితే ఈ కరోనా మహమ్మారి మాత్రం కొందరికి పండుగగా మారింది. కరోనా వారి జీవితాలను మార్చేసింది. అదేంటి కరోనా వల్ల ఎవరి జీవితాలు బాగుపడ్డాయని అనుకుంటున్నారా.. అవును.. కొన్ని దేశాల్లో కరోనా కారణంగా జైళ్ల నుంచి ఖైదీలను విడిచిపెడుతున్నారు. జైళ్లలో సామాజిక దూరం కానీ.. ఆరోగ్య సౌకర్యాలు కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి.

 

 

జైళ్లలో ఒక్కరికి సోకితే ఆ కరోనా ఖైదీలందరికీ పాకుతుంది. అందుకే జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్నారు. కరోనా విజృంభణకు తోడు రంజాన్ మాసం కూడా తోడవడంతో దుబాయి రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఏఈ జైళ్లలో మగ్గుతున్న 874 ఖైదీలను విడిచిపెట్టాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఖైదీల కుటుంబాలలో ఆనందం వెల్లి విరుస్తోంది.

 

 

ఖైదీలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టి, ప్రజలతో కలిసి జీవించేందుకు ఇదో కొత్త అవకాశం అంటున్నారు దుబాయ్ పాలకులు. దుబాయి రాజు ఇటీవలే వివిధ జైళ్లలో ఉన్న 1,511 ఖైదీలను విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి ఇంకొన్ని జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్నారు. మొత్తానికి కరోనా కారణంగా ఆ ఖైదీల జీవితాల్లో మాత్రం ఆనందం తాడవిస్తోంది. ఇప్పట్లో ఆత్మీయులను కలుసుకోలేకపోయామనుకున్న వారు ఇక పై స్వేచ్ఛావాయువులు పీల్చబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: