దేశంలో కరోనా రోజు రోజు కు విజృంభిస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ ను ఓ సారి పొడిగించినా కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిన్నఒక్క రోజే మహారాష్ట్ర లో 778 కరోనా కేసులు నమోదుకాగా  మొత్తం దేశ వ్యాప్తంగా 1600 కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఓవరాల్ గా ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 23000 దాటగా 721 మరణాలు సంభవించాయి.
 
అనూహ్యంగా పెరిగిన కేసుల తో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో పోర్చుగల్ ను దాటేసి ఇండియా 16వ స్థానంలో నిలిచింది. ఇక వచ్చే నెల 3 తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ముగియనుంది. ఇప్పటికే  కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన చాలా రాష్ట్రాలు వాటిని అమలు చేయడం లేదు. అయితే  ప్రస్తత పరిస్థితి చూస్తుంటే లాక్ డౌన్ ను మరో సారి పొడిగించక తప్పేలాలేదు. ఒకవేళ పొడిగిస్తే  దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడం ఖాయం. కేంద్రానికి కూడా మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే యోచన లేనట్లే కనిపిస్తుంది.
 
అయితే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విషయంలో అక్కడి ప్రభుత్వాలు కేంద్రంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే  తెలంగాణ లో మే 7వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. ఇక ఈనెల 27న ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎం లతో లాక్ డౌన్ ఫై మరోసారి చర్చ జరుపనున్నారు. ఆ రోజు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. సో 27న లాక్ డౌన్ మళ్ళీ పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: