కరోనా సమయంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు జోరుగా సాగుతున్నాయి. జగన్ సర్కారు కరోనాను సరిగ్గా డీల్ చేయలేకపోతోందని చంద్రబాబు రోజూ హైదరాబాద్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి దులిపేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలేమో.. జగన్ కృషి వల్లే ఏపీలో దేశంలోనే తక్కువగా కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు.

 

 

జగన్ కు పబ్జి గేమ్ పై ఉన్న శ్రద్ద కూడా కరోనాపై పోరాటంలో లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు జగన్ అసలు జనంలోకి రావడం లేదని.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జనంలో తిరుగుతూ కరోనాపై యుద్ధంలో ప్రజలకు భరోసా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు కూడా సరిగ్గానే కౌంటర్ ఇస్తున్నారు.

 

 

సీఎం వైయస్‌ జగన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని రివ్యూలు చేస్తున్నారని.. కరోనా వ్యాప్తిని అరికడుతూ పేదవారిని ఆదుకునేందుకు చేపడుతున్న కార్యక్రమాలు మీకు కనబడటం లేదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి రెండుసార్లు రేషన్ అందచేశారు. మూడుసార్లు ఆరోగ్య సర్వే చేయించారు. వేయి రూపాయలను ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఇవన్నీ మీకు కనబడటం లేదా? అంటూ నిలదీస్తున్నారు.

 

 

మరోవైపు చంద్రబాబు పాలనతో జగన్ పాలనలను పోల్చి వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మీలాగా, మీ నాయకుడు చంద్రబాబు లాగా దోమలపై యుధ్దం, ఎలుకలపై యుధ్దం అంటూ దోచుకునే ప్రభుత్వం కాదిది. అందుకనే మా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయంటున్నారు వైసీపీ నేతలు. యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు లాంటివాళ్లు వేల కోట్లు దిగమింగి ఈరోజు ఒక్కరూపాయి కూడా ప్రజలకు సేవలందించేందుకు ముందుకు రాకుండా ఇంట్లో కూర్చుని మొరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: