దేశంలో కరోనా వచ్చి ప్రజలు ఏడుస్తుంటే.. ఇక్కడ కూడా రాజకీయ రగడ మొదలయ్యింది.. రాజకీయాల్లో ప్రజల కోసం ఆలోచించడం కంటే ఎవరు తప్పుచేస్తూ దొరుకుతారా.. వారి సీటుకింద మంట ఎలా పెడదామా అని ఆలోచిస్తున్న వారే ఎక్కువగా ఉంటారని అందరికి తెలిసిందే.. ప్రజా సంక్షేమం కంటే రాజకీయ సంక్షోభం చాలా తొందరగా వ్యాపిస్తుంది.. ఇకపోతే కరోనా వైరస్ నిర్ధారణకు ఉపయోగించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక దేశాల నుంచి తెప్పించుకుంటున్న విషయం తెలిసిందే.. ఎక్కువగా చైనా, సౌత్ కొరియా దేశాలలో ఈ కిట్లు అందుబాటులో ఉన్నాయట..

 

 

కాగా ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, కేంద్రానికి చెందిన ఐసీఎంఆర్ ఇలా ఇంకా పలు రాష్ట్రాల వారు సౌత్ కొరియా నుంచి కిట్లు తెప్పించుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ కిట్ల ధరపై ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీలు గత నాలుగు రోజులుగా గొడవ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అసలు నిజం ఏదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నిస్తే.. వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు విమర్శించారు.. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలుపై మొదట ఒక్కొక్క కిట్ రూ. 730కి కొన్నట్లు చెప్పారని, ప్రిన్సిపల్ సెక్రటరీ రూ. 640అని, ఛత్తీగఢ్ రూ. 337కు కొన్నారని.. ఒక్కోక్క సమాధానం పొంతన లేకుండా చెబుతున్నారని, వీటిలో ఏది నిజమని కన్నా ప్రశ్నించారని, దీనికి వివరణ ఇస్తే సరిపోయేదని ఆయన అన్నారు.

 

 

ఈ విషయంలో వైసీపీ నేతలు సరైన వివరణ ఇవ్వకుండా ఇందులో సంబంధంలేని సుజనా చౌదరి, పురందేశ్వరిలపై విమర్శలు చేస్తూ ఎదురుదాడి చేశారని కామినేని మండిపడ్డారు.. ఇకపోతే ఈ ర్యాపిడ్ కిట్లను ఇప్పటికిప్పుడు వినియోగించవద్దని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ టెస్టింగ్ కిట్లు తప్పుడు ఫలితాలను ఇస్తుండటం వల్ల.. అందులో  ఇప్పటికే ఈ కిట్లను వాడుతున్న రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాలు తెలియచేయడంతో వీటిని మరోసారి పరిశీలించాలని నిర్ణయించామని, అందుకు రెండు రోజుల సమయం పడుతుందని ఐసీఎంఆర్ ఒక ప్రకటన చేసింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: