క‌రోనా మృతుల‌ను గుర్తించ‌డంలో...క‌రోనా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లోనూ ప‌శ్చిమ‌బెంగాల్‌లోని మ‌మ‌త ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మ‌వుతోందంటూ ఆ రాష్ట్రానికి చెందిన కొంత‌మంది వైద్యులు నేరుగా ఆమెకే బ‌హిరంగ లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో కోవిడ్‌-19వేగంగా విస్త‌రిస్తోంద‌ని వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశవ్యాప్తంగానూ పరీక్షల సంఖ్య తక్కువే ఉన్నా బెంగాల్లో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఆ రాష్ట్ర మూలాలున్న నాన్‌ రెసిడెంట్‌ వైద్యులు, ఆరోగ్య శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది లేఖ రాసిన వారిలో ఉన్నారు.అయితే జాతీయ స‌గ‌టుతో పొల్చినా అంత‌కంటే త‌క్కువ శాతంగా బెంగాల్‌లో కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. 


దేశంలో ప్ర‌తీ ప‌ది ల‌క్ష‌ల మంది రోజూ 153మంది చొప్పున క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, ప‌శ్చిమ బెంగాల్‌లో ప్ర‌తీ ప‌దిల‌క్ష‌ల మందిలో కేవ‌లం 33మందికి మాత్ర‌మే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా లేఖ‌లో ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలతో మ‌ర‌ణించిన వారికి ఎలాంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ‌మే క‌రోనా వ్యాప్తికి దోహ‌దం చేసిన‌ట్ల‌వుతుంద‌ని దుయ్య‌బ‌ట్టారు.  వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రోజుకు వెయ్యి పరీక్షలు చేయగలిగే సామర్థ్యం క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ప‌రీక్ష‌లు ఆ స్తాయిలో నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.


పరీక్షలు చేయడం ద్వారానే కరోనా వ్యాప్తిపై నిజమైన అంచనా వస్తుందన్న విష‌యం ప్ర‌భుత్వం  గ్ర‌హించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని అన్నారు.  ఇదిలా ఉండ‌గా ఇప్పటి వరకు బెంగాల్లో 7,034 పరీక్షలు చేయగా ఆంధ్రప్రదేశ్‌లో 41,512, రాజస్థాన్‌లో 55,759, తమిళనాడులో 53,045 పరీక్షలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌ మాత్రమే బెంగాల్‌ కన్నా తక్కువ పరీక్షలు నిర్వ‌హించిన రాష్ట్రాల జాబితాలో ముందువ‌రుస‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కేంద్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, కేవ‌లం లాక్‌డౌన్ అమ‌లుతోనే స‌రిపెడుతోంద‌ని విమ‌ర్శ‌లు చేసిన మ‌మ‌త ఈ లెక్క‌ల‌కు ఏం స‌మాధానం చెబుతుందో చూడాలి మ‌రి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: