లాక్‌డౌన్ వేళ ఎందరో పేదలు.. ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అని దీనంగా చూస్తున్నారు.. పిడికెడు మెతుకుల కోసం తపన పడే వారు కూడా ఉన్నారు.. సరే ఇలాంటి వారికోసం ప్రభుత్వాలు తమకు తోచినంతలో సహాయం అందిస్తున్నాయి.. ఇందులో భాగంగా ప్రభుత్వ సహాయం రూ.1500 నగదు మీ బ్యాంక్‌ ఖాతాలో జమ కాలేదా..? అయితే పరేషాన్‌కావల్సిన అవసరం లేదు. ఆహార భద్రత కార్డుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక ల్యాండ్‌లైన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

 

 

ల్యాండ్‌ ఫోన్‌ 040–23324614, 23324615 లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967లకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు... అదెలా అంటే ఆయా నెంబర్లకు ఫోన్‌ చేసి మీ ఆహార భద్రత కార్డు కొత్త నంబర్‌ చెబితే సరిపోతుంది. మీ నగదు బ్యాంక్‌ ద్వారా లేదా పోస్టాఫీస్‌లో జమ అయిందా.. కాలేదా.. ఒకవేళ బ్యాంక్‌లో జమ జరిగితే కుటుంబంలోని ఎవరి ఖాతాలో, ఎ బ్యాంక్‌లో జమ జరిగిందో తెలియచేస్తారు... అదీగాక బ్యాంక్‌లో పెండింగ్‌ ఉంటే దానికి గల స్టేటస్‌ వివరిస్తారు..

 

 

బ్యాంక్‌ ఖాతా లేకుంటే పోస్టల్‌ ద్వారా నగదు జమ అయింది లేనిది కూడా తెలియ జేస్తారు. ఒక వేళ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీసుల్లో కూడా నగదు జమ కాకుంటే ఎందుకు జమ కాలేదో స్టేటస్‌ వివరిస్తారు.. ఇకపోతే బ్యాంకు ఎకౌంట్‌ లేని వారు సమీప పోస్టాఫీసుకు వెళ్లి ఆహార భద్రత (రేషన్‌) కార్డు, లేదా రేషన్‌ కార్డు కొత్త నెంబర్‌ తెలియజేసినా చాలు. పోస్టల్‌ శాఖ సిబ్బంది వెంటనే బయోమెట్రిక్‌ (వేలిముద్ర) తీసుకొని రూ.1500 నగదు అందజేస్తారు. కానీ ఈ అమౌంట్‌ను కార్డు లోని హెడ్‌ ఆఫ్‌ ఫ్యామిలీ (కుటుంబ పెద్ద) మహిళ మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు. కాబట్టి ప్రజలు పైసలు అందలేదని బాధపడకుండా ఇలా చేస్తే సరిపోతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: