కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ప్రాణభయం  నెలకొంది. ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నా ఈ వైరస్కు సరైన విరుగుడు కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ వైరస్ నివారణ మార్గాలను వెతుకుతున్నారు ప్రజలు . ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వైరస్ నివారణకు ఏం చేయాలి అనే దానిపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు కొంత మంది వైద్య నిపుణులు కూడా తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా  వైరస్ వేడి ప్రాంతాల్లో ఉండదని సూర్యరశ్మి వల్ల కరోనా  వైరస్ నశిస్తుందని  మొదటి నుంచి ఒక వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిని కొంత మంది వైద్య నిపుణులు సరైనది అంటే కొంతమంది ఇది వాస్తవం కాదు అంటూ కొట్టిపారేస్తున్నారు.... 

 

 

 ఇక తాజాగా కరోనా వైరస్ మనుగడపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో  మరో సరికొత్త విషయం బయటపడింది. సూర్యరశ్మి సహా అధిక తేమ లేని  ప్రాంతాల్లో  కరోనా  వైరస్ మహమ్మారి త్వరగా బలహీన పడి పోతుందని తాజాగా అధ్యయనంలో వెల్లడైనట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా సూర్యకాంతికి కరోనా  వైరస్ తట్టుకోలేదని వేగంగా నిర్జీవం అయిపోతుంది అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన విలియం బ్రయాన్  వైట్ హౌస్ లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే లాలాజలం నుంచి వచ్చే తుంపర్ల కారణంగా కరోనా తేమ  వాతావరణంలో ఎక్కువగా జీవించగలుగుతుంది  అనేది  ఈ అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 

 

 

 కేవలం కరోనా  వైరస్ మాత్రమే కాకుండా వేడి వాతావరణంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటూ అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. అయితే  అధిక తేమ ఉన్న ప్రాంతాలు కరోనా వైరస్ ఏకంగా ఆరు గంటల పాటు జీవించే కలిగిందని కానీ తేమ లేని ప్రాంతాల్లో  కేవలం రెండు నిమిషాల్లోనే ఈ మహమ్మారి వైరస్ నాశనం అయిపోతుంది అంటూ అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. సూర్యరశ్మి కారణంగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి 90 సెకన్లలోనే బలం  కోల్పోయినట్లు తాజా అధ్యయనంలో గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: