తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్నటివరకు రాష్ట్రంలో 970 కరోనా కేసులు నమోదయ్యాయి. 25 మంది కరోనా భారీన పడి మృతి చెందగా 197 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. హైదరాబాద్, సూర్యాపేట ప్రాంతాలలో అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం వినూత్న ఆలోచనలు చేయాలని వెంచర్ క్యాపిటలిస్టులను కోరారు. వారంతా కరోనా పరిష్కారాల కోసం మద్ధతు ఇవ్వాలని చెప్పారు. 
 
ఇప్పటివరకు కరోనాకు మందు కనిపెట్టలేదని... ఈ వైరస్ ను కట్టడి చేయడానికి నివారణే మార్గమని చెప్పారు. ఆ నివారణ ఎలానో అర్థం కావడం లేదని చెప్పారు. లాక్ డౌన్ వర్కవుట్ కావడం లేదని... సామాజిక దూరం పని చేయడం లేదని చెప్పారు. బెంగళూరులో వెంచర్ క్యాపిటలిస్టులు 100 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేశారు. కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాపిటలిస్ట్ వాణి కోలాతో మాట్లాడారు. 
 
రాష్ట్రంలో స్టార్టప్ లు వినూత్న పరిష్కారం చూపుతున్నాయని... భారత్ కరోనా కట్టడిలో తనదైన ముద్ర వేస్తోందని చెప్పారు. బయోటెక్, మెడికల్ డివైజ్, మెడ్ టెక్ రంగాల్లో రోజురోజుకు అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. మరోవైపు కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: