ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ అధికంగా వ్యాప్తి చెందిన విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ వ‌ల్ల చాలా మంది మృత్యువాత‌ప‌డుతున్నారు. దీంతో దీన్ని నివారించే చ‌ర్య‌ల్లో ఎలాగైనా వైర‌స్‌ని అరిక‌ట్టే విధంగా వ్య‌క్తిగ‌త శుభ్ర‌త అనేది చాలా అవ‌స‌రం అని వైధ్యులు చెబుతున్నారు. ఇక దీంతో ఏ ప‌ని చేయాలా ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. ఈ వైర‌స్‌ని ఎలా అరిక‌ట్టాల‌ని శుచి శుభ్ర‌త‌ను కాస్త ఎక్కువ‌గా పాటిస్తున్నారు. అయితే ఈ వైర‌స్ వ‌ల్ల కొంత మంది సెక్స్‌కి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే సెక్స్ వ‌ల్ల క‌రోనారాద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అయితే ఈ వైర‌స్ వీర్యంలో కాని వృషణాల్లో కాని ఈ  కరోనా వైరస్ ఉన్నట్లుగా తాము జరిపిన పరిశోధనలో ఆధారాలు లభించలేదని వారు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా 34 మంది కరోనా సోకిన రోగుల నుంచి వారు వీర్యం నమూనాలను సేకరించి విశ్లేషించార‌న్నారు. అయితే ఈ ద్ర‌వ్యాల్లో మాత్రం వైరస్ కనిపించలేదంటున్నారు. 

 

దీనర్థం కరోనా రోగులకు నయమయ్యాక వారు సెక్స్‌లో పాల్గొన్న‌ప్ప‌టికీ  కొవిడ్ సోకే అవకాశం మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో లేద‌న్నారు. అయితే, రోగికి కరోనా సంక్రమించిన కాలంలో సెమినల్ ద్రవం ద్వారా వైరస్ సోకే అవకాశాలు చాలానే ఉన్న‌ట్లు స్పష్టం చేశారు. ఇక వీర్యం తయారయ్యే వృషణాల్లోనూ ఈ వైరస్ ప్రవేశించలేదని నిర్ధారించుకోవాలని నిర్ణయించిన శాస్త్రవేత్తలు ఆ దిశగానూ పరిశోధనలు చేశారు. ఇక వైరస్ అనేది కణాలలోకి ఎలా ప్రవేశిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. త‌ప్పించి సెక్స్ చేస్తే వ‌చ్చే ప్ర‌మాదం అయితే లేదంటున్నారు. ఏసీఈ2 అనే రిసెప్టర్ ద్వారా మాత్రమే ఇది శరీర కణాలలో ప్రవేశించగలుగుతుంది. కానీ చైనాలోని ఒక పరిశోధక బృందం తేల్చి చెప్పింది. వృషణ కణజాలంలో చాలా తక్కువ స్థాయి ఏసీఈ2 ఉన్నట్లు కనుగొన్నారు. అయితే, ఈ ప‌రిశోధ‌న‌లో చాలా మంది పురుషులలో ఐదో వంతు మంది కొవిడ్-19తో బాధపడుతున్నప్పుడు వృషణాల నొప్పి కలిగి ఉండడం చూస్తే ఆశ్చర్యపోయారు.

 

ఈ తాజా పరిశోధన ఫలితాలు ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘‘వీర్యం ద్వారా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందా?’’ అనే ప్రశ్నతో ఈ వ్యాసం రాశారు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఉటాహ్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేశారు. ఒకవేళ కరోనా వైరస్ అనేది సెక్స్ చేయడం వల్ల సంక్రమించినట్లయితే, దాన్ని నిరోధించడంలో ప్రభుత్వాలు అతి పెద్ద సవాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూరాలజిస్ట్ డాక్ట‌ర్లు చెబుతున్నారు. అంతేకాక, ఇది పురుష ప్రత్యేత్పత్తి వ్యవస్థకు కూడా కొంత‌మేర‌కు హానిక‌లిగిస్తుంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: