దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అంతే కాదు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది.  గత నెల 24 నుంచి కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఇంటి పట్టున ఉండాలని.. బయటకు వెళ్తే మాస్క్ ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు.  కానీ కొంత మంది మాత్రం ఇవేవీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  సైకిల్ పై వెళ్తున్న వారితో సైకిల్ మోయించ‌డం, రోడ్డుపైకి వ‌చ్చిన వారితో గుంజీలు తీయించ‌డం చేస్తున్నారు. 

 

బయటకు వచ్చిన వారు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతూ పోలీసులకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు.  కొంత మంది మెడికల్ పనిపై అంటుంటే.. మరికొందరు నిత్యావసర సరుకుల కోసం అంటూ బుకాయిస్తున్నారు.  తమిళనాడులో లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్లమీదికి వచ్చిన కుర్రవాళ్లని నకిలీ కరోన పేషెంట్ ఉన్న అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. ఇక ఆ పేషెంట్ కరోనా వచ్చిందని బ్రమించిన ముగ్గురు కుర్రాళ్లు వాళ్లు పడ్డ నరకయాతన అంతా ఇంతా కాదు... అంబులెన్స్ కిటికీ ల నుంచి పారిపోవాడానికి నానా కష్టాలు పడ్డారు.

 

ఒక నకిలీ కరోనా వైరస్ రోగిని ఏర్పాటు చేసి అంబులెన్సు లో పెట్టి వారికి ఇచ్చిన ట్రీట్మెంట్ అన్ని రాష్ట్రాలలో ఇస్తే లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్దేక్కే వారి సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.  కాగా, ఎంత చెప్పిన వినకుండా వున్న యువత కు గుణపాఠం కోసం తమిళనాడు పోలీస్ ఈ విన్నూత్న ప్రయోగంతో జనాలకు కనువిప్పు కలుగుతుందని.. భయం అనేది ఏర్పడుతుందని వారు అంటున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: