ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా విలయతాండవం చేస్తోంది. మొదట అతి తక్కువగా నమోదైన కేసులు...  ప్రస్తుతం రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే.లాక్ డౌన్  కారణంగా రాష్ట్ర ప్రజలందరూ ఉపాధి కోల్పోయారు. అయితే కాస్త డబ్బున్న వాళ్ళ పరిస్థితి లాక్ డౌన్  సమయంలో బాగానే ఉన్నప్పటికీ... రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉన్న వారికి మాత్రం రోజురోజుకు దినదినగండంగా మారిపోతుంది. పూట గడవడమే కష్టంగా మారిపోతుంది. ఈ లాక్ డౌన్  సమయంలో ఉపాధి మొత్తం కోల్పోవడం... ఇంటి మెయింటెనెన్స్ లు  ఇలా అన్ని ఖర్చులు ఉండడంతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ప్రజలు. 

 

 

 ఈ క్రమంలోనే చేనేత రంగంలో కూడా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. చేనేత రంగంలో కనీసం ఆర్డర్లు లేక... ఎలాంటి పనులు లేక చేనేత కార్మికులు అందరూ ఉపాధి కోల్పోయారు. దీంతో కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చేనేత కార్మికులు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలి అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి... టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో  మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు నారా లోకేష్. 

 

 

 అంతే కాకుండా మరో 81 వేల పవర్ లూమ్ కార్మికులు పైన కూడా ప్రస్తుతం లాక్ డౌన్  ప్రభావం పడింది అంటూ తెలిపిన నారా లోకేష్... లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో వారి జీవన విధానం దెబ్బతినడమే కాకుండా... వారు ఎంతో కష్టపడి తయారు చేసిన ఉత్పత్తులు కూడా అమ్ముడు కాక మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ నారా లోకేష్ లేఖలో తెలిపారు.అయితే ఆప్కో ద్వారా నేతన్నల  వద్ద తయారై సిద్ధంగా ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నారా  లోకేష్ . ఇక లాక్ డౌన్  సమయంలో ప్రతి నేత తన కుటుంబానికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించి.. కరోనా  సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేతన్నలకు క్లిష్ట  పరిస్థితుల్లో ప్రభుత్వం చేయూత నివ్వాలని ఆశిస్తూన్నాము   అంటూ నారా లోకేష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: