ప్రపంచం మొత్తం కంటికి కనిపించని శత్రువు కరోనా  వైరస్ తో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్పై పోరాటం ఎలా చేయాలి ఎలా తరిమికొట్టాలి అనేదానిపై సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయినా బిల్ గేట్స్ ఓ ప్రణాళికను సూచిస్తున్నారు. కరోనా  వైరస్  తరిమికొట్టడం విషయంలో సృజనాత్మకతను ప్రయోగించాలి అంటూ ఆయన సూచిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా ప్రభావాన్ని  బిల్ గేట్స్ రెండో ప్రపంచ యుద్ధం తో పోల్చారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సృజనాత్మకత ను ఉపయోగించి సత్వరం యుద్ధాన్ని ముగించారని .. ప్రపంచ మహమ్మారిని జయించడం విషయంలో కూడా సృజనాత్మకత ఎంతో అవసరమని తెలిపారు. 

 

 

 అయితే ఐదు రకాలుగా సృజనాత్మక వ్యూహాలను  అమలు చేస్తూ సృజనాత్మకతను విభజిస్తూ  కరోనా పై యుద్ధం చేయాలనీ  బిల్గేట్స్ చెప్పుకొచ్చారు. ఒకవేళ సృజనాత్మకత సాధించకుండా కరోనా  వైరస్ నియంత్రించలేమని  అంటూ గట్టిగా చెబుతున్నారు బిల్ గేట్స్. అయితే ఆయన చెప్పిన 5 సృజనాత్మక సూత్రాలు ఏమిటి అంటే. 

 

 

 పరీక్షలు : కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ముందుగా వారిని పరీక్షించి చేయాలనీ  బిల్గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న వారిని పరీక్షించడం పూర్తయిన తర్వాతే లక్షణాలు లేని వారి వెంటబడి మరీ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరీక్షల ఫలితాలు ఎక్కువ సమయం తీసుకోకుండా 24 గంటల్లోనే రావాలని అప్పుడే... కరోనా  వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం  అంటూ తెలిపారు . 

 

 

 వైరస్ కి గురైన వారిని వెతికి పట్టుకోవడం : వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో ముఖ్యమైనది వైరస్ కి గురైన వారిని వెతికి మరీ పట్టుకోవడం అంటూ చెప్పారు.  కరోనా  వైరస్ బారిన పడిన వారు ఎవరెవరిని కలుసుకున్నారు ఎవరెవరితో చర్చలు జరిపారు అనే ఈ సత్వరం గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహించాలి . ఈ విషయంలో జర్మనీ  సమర్థవంతంగా ముందుకు సాగుతుంది అని తెలిపారు. 

 

 

 నిబంధనలు ఉపసంహరణకు మార్గాలు : అయితే వ్యాపారాలను ప్రారంభించడం, ప్రదేశాల్లో  జనాన్ని అనుమతించడం సంబంధించినంతవరకు అభివృద్ధి చెందిన దేశాలు వచ్చే కరోనా  వైరస్ రెండవ దశలోకి వెళ్తాయని బిల్ గేట్స్ ఈ దశను  అర్థ సాధారణ స్థితిగా అభివర్ణించారు . అయితే ఏ అంశానికి ఎంత మేరకు అనుమతించాలి ఏ స్థాయిలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది అనేదాన్ని బట్టి ఆలోచించాల్సిన అవసరం  ఉంటుంది అంటే అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవస్థ బలంగా ఉన్న దేశాల నుంచి మిగతా దేశాలు ఎక్కడ సమస్య మొదలవుతుంది అని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. చికిత్సలు,  టీకాలు, పరీక్షలు, వైరస్ కు గురైన వారిని వెదికి పట్టుకోవడం, నిబంధనలు ఉపసంహరణకు విధానాలు లాంటివి కరోనా  వైరస్ ని తరిమి కొట్టడంలో   కీలక పాత్ర పోషిస్తాయని ప్రపంచ దేశాలకు సూచించారు బిల్ గేట్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: