భారత్ ఇపుడు ఒక యుధ్ధంలో ఉంది. ఈ యుధ్ధం సరిహద్దుల్లొ ఉన్న సైనికులు చేయడంలేదు. మొత్తానికి మొత్తం 138 కోట్ల భార‌తీయులు కత్తి పట్టకనే యుధ్ధం  చేస్తున్నారు. పంటి బిగువున ఓపిక పట్టి మరీ ఇంట్లో ఉంటూ సమరానికి సై అంటున్నారు. ఈ దేశంలో ఉన్న వలస కార్మికులు, శ్రామికులు, చిన్న జీవులు, పేదలు అంతా కలసి తొంబై శాతం ఉన్నారు.

 

అందరూ ఈ యుధ్ధంలో భాగస్వాములే. మన కోసం మాత్రమే కాదు, సమాజం కోసం అన్న ఉదాత్త ఆశయంతో కలసి యుధ్ధాన్ని చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ విధించాక నూటికి ఎనభై శాతం మంది జనం ఇంట్లోనే ఉంటూ పూర్తిగా సహకరిస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో ఇలా క్రమశిక్షణగా ఉండి చేయడం అంటే గొప్ప విషయమే.

 

అయితే వీరంతా ఒక ఆశలో ఉన్నారు. అదేంటి అంటే మే 3వ తేదీతో లాక్ డౌన్ ఎత్తివేస్తారని, నిజానికి ఏప్రిల్ 14తో లాక్ డౌన్ పూర్తి అయిపోతుందని అనుకున్నారు. కానీ పెరుగుతున్న కేసులతో మరో 19 రోజులు అంటే కూడా ఓపిక పట్టారు. ఇపుడు మరో సారి లాక్ డౌన్ ప్రకటించకతప్పదని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్లనే కరోనా కట్టడి అవుతుందని సైంటిస్టులు, నిపుణులు చెబుతున్నారు. 

 

ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ని ఎత్తివేయవద్దని కూడా వీరు సలహా ఇస్తున్నారు.  మే 3 తర్వాత ఎలాంటి కట్టడి చర్యలు చేపట్టకపోతే మే 19 నాటికి భారత్‌లో 38,220 కరోనా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 5.35 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఇది నిజంగా ప్రమాదకరమైన విషయమే.

 

దేశంలో ప్రముఖ సంస్థలుగా ఉన్న  జవహర్‌ లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎస్ఆర్), బెంగళూరు ఐఐఎస్‌, ఐఐటీ బాంబే  ‘కొవిడ్‌-19 మెడ్‌ ఇన్వెంటరీ’ అనే సైంటిఫిక్‌  స్టాటిస్టికల్‌ మోడల్‌ ను ఉపయోగించి ఈ అంచనాలను సంయుక్తంగా రూపొందించాయి. గతంలో ఈ సంస్థలే ఇటలీ, న్యూయార్క్‌ లకు అంచనాలను రూపొందించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఆయా ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయి.

 

దాంతో ఇపుడు అందరిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు భయం కూడా పెరుగుతోంది. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ కంటే మించిన ఆయుధం లేదని అంటున్నారు. కానీ మరో వైపు ఆర్ధిక నిపుణులు మాత్రం లాక్ డౌన్ వల్ల ఆకలి మరణాలు పెరుగుతాయని అంటోంది. మరి ఈ రెండింటికీ పాలకులు  బ్యాలన్స్ ఎలా చేస్తారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: