కరోనా వైరస్ రావడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల అనేక మందికి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రంగాలు మూతపడటంతో అడుగుతీసి అడుగు బయట వేయలేని పరిస్థితి ఉండటంతో నిరుపేదలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలను పేదల కోసం తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో  తెల్ల కార్డు ఉన్నవారికి రేషన్ తో పాటు నిత్యావసరాల కోసం రూ.1500 ట్రాన్స్‌ఫర్ చేసింది.

 

అయితే ఈ సందర్భంలో కొంత మందికి రేషన్ కార్డులు ఉన్నా గాని పదిహేను వందల రూపాయలు జమ కాలేదు. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు పడలేదు అని అంటున్నారో వారికి హెల్ప్ లైన్ నెంబర్ తాజాగా ప్రకటించింది. కరోనా విపత్తు కారణంగా తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరికైతే డబ్బులు పడలేదో వారి ఆందోళన దూరం చేస్తూ  తెలంగాణ పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రారంభించింది. 040-23324614 లేదా 040-23324614 లేదా 1967 నెంబర్లను అందుబాటులోకి తెచ్చి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని సూచించింది.

 

ఫోన్ చేసిన వెంటనే మీ రేషన్ కార్డు కొత్త నెంబర్ చెప్తే చాలు. మీ నగదు జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకులో జమ అయితే ఏ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యాయో వివరాలు చెబుతారు. పెండింగ్‌లో ఉంటే ఆ విషయం కూడా తెలుసుకోవచ్చు. బ్యాంకు అకౌంట్ లేనివాళ్లు పోస్ట్ ఆఫీసులో నగదు తీసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో నగదు తీసుకోవడానికి కుటుంబ పెద్ద అయిన మహిళ మాత్రమే వెళ్లాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: