కరోనా క‌ల‌క‌లం స‌మ‌యంలోనే ముస్లింల‌కు పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ పండుగ‌కు ముస్లిం సోద‌రులు స‌న్న‌ద్ధం అవుతున్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా రంజాన్ మాసంలో ముస్లింలు ఉపావాసాలు, ప్రార్థ‌న‌లు చేస్తారు. ఈ నేపథ్యంలో దేశంలోని ముస్లిం సోద‌రుల‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్యనాయుడు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆధ్మాత్మిక‌త‌ను, విశ్వాసాన్ని, దాతృత్వాన్ని, క్ష‌మాగుణాన్ని వారు ప్ర‌ద‌ర్శిస్తార‌ని ఆయ‌న త‌న పేర్కొన్నారు. ప్ర‌పంచం అంతా క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేస్తున్న త‌రుణంలో ఈ ఏడాది రంజాన్ వ‌చ్చింద‌న్నారు. ఇత‌ర సాంప్ర‌దాయ పండుగ‌ల త‌రహాలోనే.. రంజాన్ వేళ కూడా సామాజిక‌, ఆధ్మాత్మిక స‌మావేశాలు జ‌రుగుతుంటాయ‌ని,కానీ ఈ ఏడాది రంజాన్ ప్రార్థ‌న‌ల‌ను ఇంట్లోనే చేసుకోవాల‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు సూచించారు. భారీ స‌మూహాల‌ను అడ్డుకోవాన‌ల్నారు. అంద‌రం ఇంట్లోనే ఉండి.. ప్ర‌పంచ క్షేమం కోసం ప్రార్థిద్దామ‌ని అన్నారు.

 

 


ముస్లిం సోదరులకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచనలు చేశారు. రంజాన్ స‌మ‌యంలో ఈ సూచ‌న‌లు ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి. వీటిని ముస్లిం సోద‌రులు పాటిస్తే అంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు. రంజాన్‌ మాసం ప్రారంభం అవుతున్నందున అందరూ ఇళ్లల్లోనే ఉండి.. సురక్షితంగా జరుపుకోవాలని అస‌దుద్దీన్ ఓవైసీ కోరారు.  సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ముస్లిం సోదరులు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు అందరూ ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు. అన్నపూర్ణ సెంటర్ల దగ్గర సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ ఉచితంగా ఆహారాన్ని తీసుకోవాలని, ఇది కూడా సాయంత్రం ఆరు గంటలలోపు పూర్తి చేసుకోవాలని సూచించారు. పార్టీ తరపున శానిటైజర్లు, పీపీఈ కిట్స్‌ పోలీసులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఇదిలాఉండ‌గా, హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున క‌రోనా కేసులు పెరుగుండ‌గా ఎంఐఎం పార్టీ అధ్య‌క్షుడు ఓవైసీ చేసిన సూచ‌న స‌మ‌జంగానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సామాజిక బాధ్య‌త‌గా ఇత‌ర మ‌త‌స్తులు జ‌రుపుకొన్న‌ట్లే ముస్లింలు సైతం రంజాన్‌ను పండుగ‌ను చేసుకోవాల‌ని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: