కరోనా వైరస్ ఇండియాలో మహారాష్ట్రలో చాలా ప్రమాదకరంగా మారింది. దేశంలోనే ముందు నుండి అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఈ పరిణామంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. లాక్ డౌన్ కేంద్రం ప్రకటించిన సమయంలో ఎవరికి వారు ఇష్టానుసారంగా పట్టించుకోకుండా మహారాష్ట్రలో తీరగటం ఇష్టమొచ్చినట్లు రోడ్లపైకి రావడంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది. ప్రస్తుతం భారత్ లో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20 వేలకు పైగానే నమోదు అవుతుండగా వాటిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన కేసులే అధికం.

 

ఇదిలా ఉండగా రాష్ట్రంలో భయంకరమైన మురికివాడగా  ఆసియా ఖండంలోనే పెద్ద మురికి ఏరియాగా పేరు ఉన్న ‘ధారవి’ లో పాజిటివ్ కేసులు దారుణం గా బయట పడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో 214 మంది కరోనా పాజిటివ్‌గా తేలింది. 13 మంది చనిపోయారు. దాదాపు 8 లక్షల మంది జీవిస్తున్న ఈ ప్రాంతంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే వైరస్ విజృంభణ చాలా దారుణంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

 

ఈ పరిణామంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం కనుమరుగైపోయిన ఆశ్చర్యపోనవసరం లేదని కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ధారవి పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇది కచ్చితంగా ముంబై వాసులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ముంబై తర్వాత ఢిల్లీలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఒకటి దేశ రాజధాని మరొకటి దేశ ఆర్థిక రాజధాని లో వైరస్ చాలా బలపడుతున్న తరుణంలో ప్రభుత్వాలు కట్టు దిట్టంగా వ్యవహరించాలని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: