గత రెండు రోజుల నుండి డబుల్ డిజిట్ కేసులు నమోదైన కేరళ లో ఈరోజు కేవలం 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య అక్కడ 450కి చేరింది. ఇందులో ప్రస్తుతం116 కేసులు యాక్టీవ్ గా ఉండగా 331మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు కాగా ముగ్గురు మరణించారని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. అయితే కరోనా ప్రభావం తగ్గినా  కూడా లాక్ డౌన్ ను మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతుండడం శుభపరిణామం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 కేసులు మాత్రమే నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 983 కు చేరింది. హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల లో మాత్రం ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా వుంది. ఈ జిల్లాల్లో కనుక కరోనా ను కట్టడి చేయగలిగితే  తెలంగాణ కరోనా నుండి బయటపడ్డట్లే. ఇక ఆంధ్రా లో మాత్రం రోజు రోజుకు కేసులు పెరుగుతూనే వున్నాయి. ఈఒక్క రోజే అక్కడ 62 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 955 కి చేరింది. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా  కరోనా కేసుల సంఖ్య  24000కు చేరగా అందులో  744మంది మరణించారు. 5224 మంది కోలుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: