ప్రస్తుతం ప్రపంచం మొత్తం వీరవిహారం చేస్తున్న కరోనా వైరస్ సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు పరిశోధకులు విపరీతంగా శ్రమిస్తూ ఉండగా మరొకవైపు శాస్త్రవేత్తలు మరియు వైజ్ఞానికులు వైరస్ ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా అంతా బఫర్ కిట్స్ ను ప్రామాణికంగా తీసుకొని కరోనా టెస్టులు జరుపుతుండగా.. మన ఇండియాలోనే జగన్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో కరోనా నిర్ధారణ జరిగేలా చూస్తోంది.

 

ఇక అనుమానితులు ఎక్కువ మరియు టెస్టింగ్ పరికరాలు తక్కువ అవుతున్న సమయంలో ఐఐటీ రూర్కీ కు చెందిన ప్రొఫెసర్ కేవలం 5 సెకండ్లలో కరోనా వైరస్ ను గుర్తించే సరికొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. కరోనా అనుమానిత వ్యక్తి ని ఎక్స్ రే స్కాన్ చేయడం ద్వారా కేవలం ఐదు సెకన్లలో రోగ నిర్ధారణ చేయవచ్చని అంటున్నాడు ప్రొఫెసర్.

 

ఇక్కడ ట్రిక్ ఏమిటంటే ఈయన రూపొందించిన సాఫ్ట్వేర్ ను ఉపయోగించే వైద్యులు ఎక్స్ రే ద్వారా రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడం కాకుండా అది కరోనా వల్ల వచ్చిందా లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అని గుర్తించవచ్చు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కి పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి ఆయన దరఖాస్తు చేసుకున్నారు.

 

సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ వెల్లడించారు. కరోనా - న్యుమోనియా - క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్ లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. సాఫ్ట్ వేర్ తో కరోనా పరీక్షల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని కచ్చితంగా చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: