కరోనా వచ్చినట్టు అనుమానం ఉన్నవారిని క్వారంటైన్ కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా .. వారి బంధువులకో చుట్టుపక్కలవారికో కరోనా వస్తే.. అలాంటి వారిని హోమ్ క్వారంటైన్‌ కింది వారి ఇళ్లలోనే ఉంచుతున్నారు. వీరిపై పోలీసుల నిఘా ఉంటోంది. అయితే కొందరు మాత్రం హోం క్వారంటైన్ లో ఉన్నా పోలీసుల కళ్లుగప్పి బయట తిరుగుతున్నారు.

 

 

ఇప్పుడు ఇలాంటి వారికి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్‌ యాప్‌ ద్వారా జియో ఫెన్సింగ్‌ టెక్నాలజీతో పర్యవేక్షిస్తున్నారు. 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశారు. జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేశారు.

 

 

ఇందుకోసం ఏపీ పోలీసులు ఓ యాప్ రూపొందించారు. ఈ యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టారు. అంతే కాదు.. రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైలు యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు.

 

 

ఈ కొత్త యాప్ లు, టెక్నాలజీ గురించి ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియాకు వివరించారు. కరోనా కట్టడిలో సాయపడుతున్న వారికి తాము రుణపడి ఉంటామంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖకు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనమని మెచ్చుకున్నారు. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై నిఘా కోసం కూడా ఏపీ పోలీసులు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: