శ‌వాలు గుట్ట‌లుగా ప‌డుతున్నాయి.. ఆక్రంద‌నాలు మిన్నంటుతున్నాయి. ఖ‌న‌నం చేయ‌డానికి దేశాలు చాలిన‌న్నీ స్థ‌లాలు వెతుక్కుంటున్నాయి.. మ‌నిషికి క‌డ‌సారి వీడ్కోలు క‌డు ద‌య‌నీయంగా సాగుతోంది. ఏ మ‌నిషి త‌న అంతిమ‌యాత్ర‌ను ఆవిధంగా సాగాల‌ని కోరుకోడు.. ద‌క్షిణ బ్రెజిల్‌లో జ‌రిగిన సామూహిక ఖ‌న‌నాల వీడియో చూసిన వారికెవ‌రికైనా క‌ళ్లు చెమ‌ర్చ‌క మాన‌డం లేదు. కరోనాతో మ‌ర‌ణించిన వారి వంద‌లాది మృత‌దేహాల‌ను ఒకేచోట పూడ్చివేశారు. అతికొద్దిమంది కుటుంబ స‌భ్యుల‌కు మాత్ర‌మే ఇందుకు సామాజిక దూరం పాటించే ప‌ద్ధ‌తిలో అనుమ‌తించారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారింది. క‌రోనా ర‌క్క‌సి విల‌య‌తాండ‌వానికి ఇది నిద‌ర్శ‌నం. దేవుడా..! ఎందుకింత శిక్ష విధించావు మాకు అంటూ మృతువుల బంధువుల రోద‌న‌లు మిన్నంటుతున్నాయి.

 


ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హ‌మ్మారి క‌రోనా ర‌క్క‌సి క‌రాళ నృత్యం చేస్తోంది.  'కొవిడ్‌-19' వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ గ‌ణ‌నీయంగా పెరుగుతూనే ఉంది. అనేక దేశాలు మ‌రుభూమిగా మారుతున్నాయి. క‌రోనా శ‌వాలుగా గుట్ట‌లుగా ప‌డుతున్నాయి.  వంద‌లాది మృత‌దేహాల‌ను సామూహిక ఖ‌న‌నం చేపడుతున్నారు. ఒక్క  శుక్రవారం రోజే క‌రోనాతో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 1.90 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌ర‌ణాల్లో మూడింట రెండో వంతు మ‌ర‌ణాలు యూర‌ప్‌లోనే ఉండ‌టం బాధాక‌రం. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఇప్పటివ‌ర‌కు 26,98,733 మంది క‌రోనా బారిన‌ప‌డ్డ‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌టించింది. 

 

ఇక 1,90,089 మంది మృత్యువాత ప‌డ్డారు. వీటిలో 116,221 మ‌ర‌ణాలు... 1,296,248 కేసులు యూర‌ప్‌లో న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. క‌రోనాతో అగ్ర‌రాజ్యం క‌కావిక‌లం అవుతోంది. మ‌ర‌ణాల సంఖ్య కాస్త త‌గ్గ‌ముఖం ప‌ట్టినా ఇంకా క‌రోనా కోర‌లు చాస్తునే ఉంది. అగ్ర‌రాజ్యం అమెరికాలో ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. యూఎస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 50,243 మంది మ‌ర‌ణించగా, 8.86 ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో బాధ‌ప‌డుతున్నారు.  గ‌డిచిన 24 గంటల్లో అమెరికాలో 3,176 కరోనా మరణాలు సంభవించాయి.  అమెరికా త‌ర్వాత ఇటలీ-25,549, స్పెయిన్‌-21,717, ఫ్రాన్స్‌లో-21,856, బ్రిట‌న్‌లో-18,738 మంది ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల చ‌నిపోయారు. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: