దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నీ సంచలన విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడు గా దూసుకుపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఓటమి ఎరుగని  దర్శకుడిగా మొదటి స్థానంలో ఉన్నారు రాజమౌళి. అయితే రాజమౌళి సినిమా అంటే ఒక రేంజ్ లో ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి అనే విషయం తెలిసిందే. ప్రేక్షకులు అందరూ తమ అభిమాన హీరో తో రాజమౌళి సినిమా తీస్తే  బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అటు చిన్న హీరోలు కూడా రాజమౌళి కంటపడితే స్టార్ హీరో అయిపోవచ్చు అనుకుంటారు. ఎందుకంటే రాజమౌళి ఏ హీరోతో సినిమా తీసినా అది ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పోవడమే కాదు... భారీ వసూళ్లను రాబడుతోంది. 

 

 

 అందుకే అందరు హీరోల అభిమానులు తమ హీరో తో రాజమౌళి సినిమా తీస్తే  బాగుండు అనుకుంటూ ఉంటారు. ఇలా అభిమానులు గట్టిగా అనుకున్న కొన్ని కొన్ని సార్లు జరిగినవి కూడా ఉన్నాయి. ఊహించని విధంగా కమెడియన్ సునీల్ తో రాజమౌళి సినిమా తీయడం... ఆ తర్వాత చిన్న హీరో గా ఉన్న నానితో సినిమా తీయడం లాంటివి జరిగాయి. అలాంటిది భారీ ఎత్తున అభిమానులు ఉన్న హీరో పవన్ కల్యాణ్ తో రాజమౌళి సినిమా తీస్తే  ఏ రేంజిలో ఉంటుంది. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే భారీ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. 

 

 

 అలాంటిది ఇక పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో తో సినిమా అంటే అది అంచనాలకు మించి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇది ఊహించని కాంబినేషన్. ఇక అటు  మెగా అభిమానులు ఈ కాంబినేషన్ ఎప్పటికైనా చూడాలనే ఆశతో ఉన్నారు అన్న విషయం అందరికి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో  దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే అది ఏ రేంజిలో ఉంటుంది దానికి కథ ఎలా ఉంటుంది అనేది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. మామూలుగానే రాజమౌళి సినిమాలో హీరోలు అంతకు ముందు ఎలా ఉన్నప్పటికీ తన సినిమాలలో మాత్రం ఒక ప్రత్యేకతతో గెటప్ తో  కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటిది రాజమౌళి ఒకవేళ పవన్ కళ్యాణ్ తో  సినిమా చేస్తే ఎలాంటి కథను సిద్ధం చేసుకుంటారు అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా అనేది మాత్రం ఎవ్వరికి తెలియని రహస్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: