దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ప్రతిరోజూ కేసులు, మరణాలు పెరిగిపోతున్నా యి.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కాస్త ఉపశమనం కలిగించినా మహరాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంత పెరిగిపోతున్నాయి.  ఎన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నా మర్కజ్ ప్రభావం ఈ వైరస్ వ్యాప్తికి మూలం అని అంటున్నారు.  గతంలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఈ వైరస్ ప్రభావం చూపిస్తే ఇటీవల ఢిల్లీ ముజాహిద్దీన్ మర్కజ్ ప్రార్థన సమావేశంలో పాల్గొని వచ్చిన వారి వల్ల వైరస్ కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు.  తాజాగా కర్నూలు జిల్లాలో రోజురోజూకీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.

 

కరోనా కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.  తాజాగా కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టి కరోనా నివారణ చర్యలు చేపట్టకుంటే పరిస్దితి చేదాటి పోతుందని అన్నారు. కర్నూల్ కు ప్రత్యేక బృందాలను పంపించి సరైన వ్యూహంతో కరోనాను కట్టడి చేయాలని సూచించారు. ఆందోళనలో ఉన్న ప్రజల్లో మనోధైర్యం నింపాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు. ఏపిలో అన్ని జిల్లాల్లో కన్నా కర్నూల్ పై మొదటి నుంచి ప్రభావం ఎక్కువ గా చూపిస్తుందని.. ఇప్పటికైనా ప్రభుత్వం తగు రీతిలో స్పందించి ఇక్కడ తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  

 

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు 27 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. వీరిలో 145 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.మరోవైపు ర్నూలులో రోజురోజూకీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం పకడ్బంధీ చర్యలు తీసుకుంది. కాగా, ఇప్పటివరకు 29 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 781గా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: