దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి బాధ వర్ణనాతీతం. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సాక్ష్యంగా నిలుస్తోంది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్ ‌ జిజ్నోర్‌లోని మీర్జాపూర్‌ బేలాకు చెందిన 50 ఏళ్ల వలస కార్మికుడు నరిందర్‌ సింగ్‌ లాక్ డౌన్ వల్ల కశ్మీర్ లో చిక్కుకుపోయాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి క్యాన్సర్ తో బాధ పడుతున్న నరిందర్ సింగ్ 18వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్పడంతో నరిందర్ సింగ్ తన సొంతూరికి పంపించాలని అధికారులను, వైద్యులను కోరాడు. 
 
అయితే చికిత్స పొందుతూ రెందు రోజుల క్రితం నరిందర్ సింగ్ మరణించాడు. అయితే తండ్రి మృతి చెందాడని తెలుసుకున్న కొడుకు ముంబై నుంచి సైకిల్ పై బయలుదేరాడు. తండ్రి కడసారి చూపుకు ఎలాగైనా నోచుకోవాలనే ఉద్దేశంతో అతని కుమారుడు సైకిల్ పై బయలుదేరాడు. మరోవైపు నరిందర్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నారు .దీంతో నరిందర్ ‌సింగ్‌ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అధికారులకు అంతుపట్టడం లేదు. 
 
మరోవైపు లాక్ డౌన్ వల్ల ప్రముఖులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోవడంతో సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. దేశంలో మే 3వ తేదీ తరువాత కూడా లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.                      

మరింత సమాచారం తెలుసుకోండి: