ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వంఎన్ని  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం భయం గుప్పిట్లో బతుకును వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందింది అని చెప్పాలి. మొదట్లో అతి తక్కువగా నమోదైన కరోనా వైరస్  కేసుల సంఖ్య ప్రస్తుతం క్రమక్రమంగా భారీగా పెరిగి పోతుంది. దీంతో  ప్రజల్లో ప్రాణభయం  కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా జిల్లాల వారీగా గత 24 గంటల వ్యవధిలో ఎన్ని కేసులు పెరిగాయో  ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో ఐదు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి... ఈ ఐదు కేసులతో  కలిపి మొత్తం జిల్లాలో 51 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 34 కేసులు యాక్టివ్ గా ఉండగా... 9 మందికి ఈ వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు నలుగురు ఈ వైరస్ ద్వారా మృత్యువాత పడ్డారు. చిత్తూరులో గత 24 గంటల్లో ఒక్క పాజిటివ్  కేసు కూడా నమోదు కాలేదు. మొత్తంగా చిత్తూరులో 73 కేసులు కాగా  62 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈస్ట్ గోదావరి గత 24 గంటల్లో మూడు కొత్త కేసులు నమోదు కాగా మొత్తం 37 కేసులు నమోదయ్యాయి. కాగా ప్రస్తుతం 27 మంది చికిత్స పొందుతుండగా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు . 

 

 

 ఇక గుంటూరు జిల్లాలో గత 24 గంటలు 3 కొత్త కేసులు నమోదు కాగా మొత్తంగా 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 175 మంది చికిత్స తీసుకుంటూ ఉండగా 23 మంది డిశ్చార్జ్ అయ్యారు.  కాగా ఎనిమిది మంది ఈ వైరస్ బారినపడి మరణించారు. కడప జిల్లాలో గత 24 గంటల్లో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి మొత్తంగా  55 పాజిటివ్ కేసులు ఉండగా 27 మంది చికిత్స తీసుకుంటున్నారు మరో 28 మంది ఈ మహమ్మారి వైరస్ భారీ నుండి కోలుకుని డిశ్చార్జ్ చేశారు. కృష్ణాజిల్లాలో 24 గంటలు 25 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మొత్తంగా జిల్లాలో 127 కేసులు నమోదు కాగా 90 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఎనిమిది మంది ఈ వైరస్ బారినపడి చనిపోయారు. 

 

 

 కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో 14 కేసులు నమోదు కాగా మొత్తం 275 కేసులు నమోదయ్యాయి 259 చికిత్స తీసుకుంటూ ఉండగా ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు తొమ్మిది మంది మరణించారు. నెల్లూరులో నాలుగు కొత్త కేసులు నమోదు కాగా మొత్తంగా 72 కేసులు అయ్యాయి.  జిల్లాలో 60 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా..  ఎనిమిది మంది ఈ వైరస్ బారి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు  ఈ వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక శ్రీకాకుళం జిల్లాలో గత 24 గంటల్లో 3 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా ఇదే మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో నమోదైన కేసులు . మిగతా జిల్లాలో గత 24 గంటల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: